S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టి.సర్కారు అడిగితే కేంద్రం నిధులిస్తుంది

హైదరాబాద్, సెప్టెంబర్ 23: అల్పపీడనంతో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి (సిడిఆర్‌ఎఫ్) నుంచి తాత్కాలిక సహాయం అందజేస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపించే నివేదిక ఆధారంగా కేంద్రం సహాయం అందజేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో తానూ చొరవ తీసుకుని సంబంధిత కేంద్ర మంత్రులతో మాట్లాడి ఇతోధిక సహాయం అందించేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం ఢిల్లీలో తనను కలిసి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చించారని చెప్పారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రోడ్ల నిర్మాణం కోసం 1,090 కోట్ల రూపాయలు, మానేరు నదిపై వంతెన, వరంగల్ జిల్లా తుపాకులగూడెంలో నిర్మించబోయే వంతెన నిర్మాణం కోసం వంద కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేసినట్లు దత్తాత్రేయ తెలిపారు.