S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏటా 10వేల మంది దళితులకు నైపుణ్య శిక్షణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళితులకు ఉపాది అవకాశాలు పెంపోదించేందుకు ఏటా పది వేల మంది చొప్పున వచ్చే మూడేళ్లలో 30వేల మందికి శిక్షణ ఇచ్చి, వారి నైపుణ్యాలను మెరుగు పెట్టనున్నట్టు ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్ణయించింది. అందులోభాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ), ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ల అధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా లెదర్ పరిశ్రమలో దళితులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఎస్సీ కార్పొరేషన్ 30 కోట్ల రూపాయలు కేటాయించనుంది. ఈ వివరాలను ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ విలేఖరులను వివరించారు. వారం పది రోజుల్లో ప్రారంభించనున్న పోర్టల్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ విజయ్‌కుమార్ తెలిపారు.