S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దొడ్డిదారి అడ్మిషన్లు!

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణలో దొడ్డిదారిన మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి అన్ని మెడికల్ కాలేజీల్లో సీట్లను మెరిట్ ప్రాతిపదికగానే నింపాల్సి ఉంది. మెరిట్ ప్రాతిపదికపైనే సీట్ల భర్తీ జరుగుతోందా? లేదా? అన్నది ఆయా రాష్ట్రాల వైద్యవిద్యా విభాగం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
అయితే మెడికల్ కాలేజీలు కన్వీనర్ కోటాను ఎమ్సెట్-3 ద్వారా, ప్రైవేటు కాలేజీల కన్వీనర్-2 కోటా (బి కేటగిరి) సీట్లను నీట్ మెరిట్ ద్వారా, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను నీట్ మెరిట్ లేదా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు మార్కుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి అన్ని నిబంధనలనూ ప్రభుత్వం చాలా స్పష్టంగా రూపొందించినా, యాజమాన్యాలు మాత్రం విద్యార్థులతో బేరసారాలకు దిగుతున్నాయి. కన్వీనర్-1 కోటా సీట్ల భర్తీ తొలి దశ జాబితాను గురువారం సాయంత్రం విడుదల చేశారు. కన్వీనర్-2 కోటా సీట్లకు సంబంధించి ఉస్మానియా యూనివర్శిటీలో యాజమాన్యాలు కౌనె్సలింగ్‌ను ఏర్పాటు చేశాయి. అయితే పేరుకు అక్కడ కౌనె్సలింగ్ ఏర్పాటు చేసినా, వాస్తవానికి విద్యార్థులతో నేరుగా యాజమాన్యాలు మాట్లాడుకుంటున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరో పక్క మధ్య దళారులు రంగంలోకి దిగి సీట్ల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య విభాగం కానీ, ఉన్నత విద్యామండలి కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గమనార్హం.