S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రెండో పెళ్లి చేసుకున్నాడని భర్తపై యాసిడ్ పోసేసింది!

జమ్ము, సెప్టెంబర్ 23: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త రెండోపెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో ఓ మహిళ అతనిపై యాసిడ్ కుమ్మరించింది. ఈ ఘటనలో ఆమెకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. కతువా జిల్లాలోని బని పట్టణంలో మహమ్మద్ దిన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల క్రితం షమీమా అఖ్తర్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. మహమ్మద్ దిన్ ఇప్పుడు రెండో వివాహం చేసుకోవడంతో కుమార్తెతో కలిసి షమీమ్ యాసిడ్‌పోసింది. మరో ఇద్దరి సహాయం కూడా తీసుకుంది. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించామనీ, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేష్ గౌతమ్ వెల్లడించారు. డిశ్చార్జి అనంతరం షమీమ్, ఆమె కుమార్తెపై కేసు నమోదు చేస్తామని, విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.