S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అనాథ పిల్లలకు ఒబిసి రిజర్వేషన్!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) చేసిన తీర్మానం ప్రకారం పదేళ్ల లోపు అమ్మానాన్నలిద్దరిని కోల్పోయి, సంరక్షకులు ఎవరూ లేక అనాథలుగా మిగిలిన జనరల్ కేటగిరికి చెందిన పిల్లలు ప్రభుత్వ విద్యాసంస్థలు, ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) కోటాలో రిజర్వేషన్లు పొందుతారు. ఎన్‌సిబిసి గత వారం ఈ తీర్మానాన్ని ఆమోదించిందని కమిషన్ సభ్యుడు అశోక్ సాయిని ఒక వార్తాసంస్థకు చెప్పారు. పదేళ్ల లోపు తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి, పోషించే సంరక్షకులు ఎవరూ లేకుండా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న అనాథాశ్రమాలు, పాఠశాలల్లో చదువుతున్న అనాథ పిల్లలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన వివరించారు. కమిషన్ చేసిన ఈ తీర్మానం ప్రతిని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆయన తెలిపారు. కమిషన్ చేసిన తీర్మానాన్ని అత్యున్నత స్థాయి రాజకీయ అధికార నాయకత్వం పరిశీలిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ రిజర్వేషన్లకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అవసరం. తమిళనాడులో ఇలాంటి రిజర్వేషన్లు గత మూడు సంవత్సరాలుగా అమలులో ఉన్నాయి. తెలంగాణ, రాజస్థాన్‌లు కూడా అనాథ పిల్లలను ఒబిసి కోటాలో చేర్చాయి. ఎన్‌సిబిసి గతంలో ట్రాన్స్‌జెండర్‌లకు ఒబిసిలకు కేటాయించిన 27 శాతం కోటాలో రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానించింది. అయితే ఒబిసి గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోలేదు.