S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజ్‌నాథ్‌తో పారికర్ భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కాశ్మీర్‌లో తాజా పరిస్థితులపైనా, వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. అరగంటపాటు జరిగిన ఈ ఇద్దరు సీనియర్ మంత్రుల సమావేశంలో పలు కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చొరబాట్లను తీసుకుంటున్న చర్యలతో పాటు ముంబయి తీరంలో అనుమానితుల సంచారం కూడా ఈ చర్చలో చోటుచేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే వచ్చే నెలలో గోవాలో జరిగే బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లపై కూడా వీరు చర్చించారు. అక్టోబర్ 15-16 తేదీల్లో జరిగే బ్రిక్స్ దేశాల సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాధినేతలు హాజరుకానున్న విషయం విదితమే. ఈ క్రమంలో గోవాకు చెందిన ఈ ఇద్దరు సీనియర్ మంత్రులు బ్రిక్స్ సమావేశాల భద్రతా ఏర్పాట్లను కూలంకషంగా చర్చించారు. కాగా, కాశ్మీర్‌లో నేటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. 77 రోజులుగా సాగుతున్న ఆందోళనలు శుక్రవారం కూడా జన జీవనం స్తంభించింది. శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ పంప్‌లు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. రహదారులన్నీ జనసంచారం లేక బోసిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు నేటికీ తెరుచుకోలేదు.