S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టీచర్లకూ పరీక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య ప్రమాణాలు పెంచేందుకు గత ఏడాది నుండి తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుండగా, రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల ప్రావీణ్యాన్ని పెంచేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పనితీరును సమీక్షించాలని కూడా చూస్తోం ది. ఇందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రానున్న రోజుల్లో దేశంలో నూతన విద్యావిధానం అమలుకానున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులతో పాటు పాఠశాలలను సంస్కరించే పనిలో పడింది. రానున్న రోజుల్లో విద్యా ప్రణాళిక-పరిపాలనపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాజేంద్రనగర్ లోని టిపార్డులో రెండు రోజుల పాటు జరిగే సదస్సు శుక్రవారం నాడు ప్రారంభమైంది. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలూ కొత్త విద్యావిధానాన్ని అమలుచేసేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ జి కిషన్ చెప్పారు. రాష్ట్రంలో అక్షరాస్యత 32 శాతం ఉందని, దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయడంతో పాటు భవిష్యత్ బాధ్యతగా కూడా తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత తరుణంలో ఎక్కువ మంది ప్రైవేటు విద్యపై మొగ్గు చూపుతున్నారని ఈ పరిస్థితిని అధిగమించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని అన్నారు. భావితరాలకు యువతను అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కొందరు తమ బాధ్యతను విస్మరించి పనిచేస్తున్నందునే ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదని దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని అన్నారు. దీనిని అధ్యయనం చేయడానికి రాష్ట్ర స్థాయి బృందాన్ని పంపించామని పేర్కొన్నారు. ఈ ఏడాది విద్యార్థుల నమోదు శాతం పెరిగినా, కొంత కాలానికి వారు డ్రాపవుట్ అవుతున్నారని దీనిని అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. జాతీయ విశ్వవిద్యాలయాల విద్యా ప్రణాళిక పరిపాలనా సంస్థ ప్రొఫెసర్ కుమార్ సురేష్ మాట్లాడుతూ విద్యా విధానంలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యానంతరం వారికి అనువైన శిక్షణ ఇచ్చి తగిన ఉపాధి కల్పించే విధంగా కేంద్రప్రభఉత్వం నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఇఆర్‌టి డైరెక్టర్ ఎస్ జగన్నాధరెడ్డి, రాష్ట్ర పాఠ్యపుస్తకాల డైరెక్టర్ వి సుధాకర్, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ, పరీక్షల డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, దృశ్యశ్రణ విద్యా డైరెక్టర్ రాధారెడ్డి, వయోజన విద్య డైరెక్టర్ ఎ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.