S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్పోర్ట్స్ కోటా కింద వైద్య సీట్లు ఇవ్వొద్దు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఈ విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటా కింద ఆంధ్రాలో ఎంబిబిఎస్, దంత వైద్య కళాశాలల్లో సీట్లను కేటాయించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ఈ కేసులో పిటిషనర్ జి తన్మయి తరఫున న్యాయవాది రఘునందనరావు వాదనలు వినిపిస్తూ, స్పోర్ట్స్ కోటా కింద తయారు చేసిన మెరిట్ లిస్టులో అనేక అవకతవకలు ఉన్నాయని తెలిపారు. తక్కువ ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎక్కువ ప్రతిభ కింద చూపెట్టి మెరిట్ లిస్టులో అగ్రస్ధానంలో అవకాశం కల్పించారని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీట్లు పొందిన నలుగురు అభ్యర్థులకు సీట్లను రిజర్వు చేయాలని, మిగిలిన సీట్లను ఏ కేటగిరీ సీట్లతో కలపాలని, కౌనె్సలింగ్ ద్వారా ఆ సీట్లను ప్రతిభావంతులైన విద్యార్థులకు కేటాయించాలని ఆదేశించింది.