S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టర్నోవర్ కోటిన్నర దాటే సంస్థలపై కేంద్ర, రాష్ట్రాల నియంత్రణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: ఏడాదికి కోటిన్నరకు పైగా టర్నోవర్ ఉండే వ్యాపారాలు, పరిశ్రమలు, సంస్థలు అన్నింటిపై కేంద్ర, రాష్ట్రాలకు నియంత్రణ ఉంటుందని ఎపి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో శుక్రవారం కూడా జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం రెండోరోజు జరిగింది. ఈ సమావేశానికి ఏపి తరఫున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. సమావేశం అనంతరం యనమల మాట్లాడుతూ, ఈ కోటిన్నర టర్నోవర్ వ్యాపారం చేసే సంస్థలపై కేంద్ర,రాష్ట్రాల్లో ఎవరో ఒకరు మాత్రమే పన్ను చెల్లింపుదారుల నుంచి పన్నుల వసూలు చేస్తారని తెలిపారు. ఎవరు ఎలా వసూలు చేయాలన్న దానిపై కేంద్ర, రాష్ట్రాల అధికారులతో కూడిన సబ్ కమిటీ విధి విధానాలును రూపొందిస్తుదని ఆయన చేప్పారు. జిఎస్‌టి పరిధి నుంచి రూ.20 లక్షల లోపు వ్యాపారం చేసే చిరు వ్యాపారులను తప్పించాలని కోరామని, తద్వారా చిరు వ్యాపారులు జిఎస్‌టి కింద రిజిస్టర్ చేసుకుని పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదని తెలిపారు.ఏపీలో మొత్తం 2.43 లక్షల డీలర్లు ఉన్నరని, వీరిలో 1.23 లక్షల మంది అంటే దాదాపు 51 శాతం మంది చిరు వ్యాపారులేనని చెప్పారు. దాని మూలంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికి కేంద్రం చెల్లింపు పరిహారం విషయంలో 2015-16 ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకోవాలని ఈ సమావేశంలో కోరారు.