S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆంధ్ర, ఉస్మానియాలకు ప్రపంచ ర్యాంకింగ్

హైదరాబాద్, సెప్టెంబర్ 23: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ 2016-17 సంవత్సరానికి ప్రకటించిన ప్రతిష్ఠాత్మక వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడు విశ్వవిద్యాలయాలు, తెలంగాణకు చెందిన ఒక విశ్వవిద్యాలయం స్థానాన్ని దక్కించుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ నుండి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ 601-800 ర్యాంకు బ్యాండ్‌లో ఉండగా ఆంధ్రా యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీ, ఆచార్య నాగార్జున వర్శిటీ, పద్మావతి మహిళా యూనివర్శిటీ, కాకినాడ జెఎన్‌టియు, అనంతపురం జెఎన్‌టియు, శ్రీ కృష్ణదేవరాయ వర్శిటీ ఉన్నాయి. ఎస్వీయు 600-800 ర్యాంకింగ్ బ్యాండ్‌లో ఉండగా, ఎయు, ఎఎన్‌యు, ఉస్మానియా 800 ప్లస్ ర్యాంకు బ్యాండ్‌లో నిలిచాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వర్శిటీల జాబితాలో ఎస్వీయు ఉన్నత స్థానంలో ఉంది.