S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అత్యవసర బృందాల ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్ర రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్ధను అత్యవసర ప్రాతిపదికపై పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ప్రత్యేక పవర్ బ్రేక్ డౌన్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ ఘాతాలకు తావులేకుండా పూర్తి స్ధాయి విద్యుత్ ఘాత నిరోధక వ్యవస్ధను నెలకొల్పుతున్నట్లు చెప్పారు. డిస్కాంలు వినియోగదారుల కేర్ కాల్ సెంటర్లను 24 గంటల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, సర్వీసు వైర్ కనెక్షన్ల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయమైన విద్యుత్ శాఖ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. భారీ వర్షాల ప్రభావం తగ్గే వరకు విద్యుత్ సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని చోట్ల విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు నరికివేయాలని, లూజ్ లైన్లను పటిష్టం చేయడం, పడిపోయిన స్తంభాల స్ధానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సబ్‌స్టేషన్లు ఎక్కడ దెబ్బతిన్నట్లు సమాచారం లేదన్నారు. 33/11 కెవి సబ్‌స్టేషన్లు 20 దెబ్బతింటే 17పునరుద్ధరించామని, 33 కెవి ఫీడర్లు 8 దెబ్బతింటే ఐదు పునర్ధురించామని, వ్యవసాయేతర సర్వీసుల్లో 34,647 సర్వీసులు దెబ్బతింటే ఇంతవరకు 30072 సరిచేశామని అజయ్ జైన్ తెలిపారు. రెండు డిస్కాంల సిఎండిలు, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్‌తో విద్యుత్ పరిస్థితిపై సమీక్షించినట్లు ఆయన చెప్పారు.