S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భగీరథకు మొత్తం 6750కోట్ల రుణం

హైదరాబాద్, సెప్టెంబర్ 23: ఆంధ్రా బ్యాంకు నేతృత్వంలో ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంగా ఏర్పడి మిషన్ భగీరథకు మొత్తం 6750 కోట్ల రూణాన్ని అందజేయనున్నాయి. శుక్రవారం సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కన్సార్టియం సమావేశం జరిగింది. ఆంధ్రాబ్యాంకు 1300 కోట్లు, దేనా బ్యాంకు 500 కోట్లు, పంజాబ్ అండ్ సింథ్ బ్యాంక్ 700 కోట్లు, సిండికేట్ బ్యాంకు వెయ్యి కోట్లు, ఓబిసి బ్యాంక్ 1000కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1000 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 750 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ 500 కోట్లు మొత్తం ఎనిమిది బ్యాంకు కన్సార్టియం 6750 కోట్ల రూపాయలను ఈనెల 29న అందజేయనుంది. పంచాయితీరాజ్ శాఖ స్పెషల్ సిఎస్ ఎస్పీసింగ్, ఇతర అధికారులు, ఆయా బ్యాంకుల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మిషన్ భగీరథ అమలుకు బ్యాంకుల రుణాన్ని అందించనున్నట్టు చెప్పారు.