S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వేములఘాట్‌లో 144 సెక్షన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: వేములఘాట్ గ్రామంలో 114 సెక్షన్ కింద ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో గ్రామస్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం వాదనలు ముగిసాయి. కాగా న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పును రిజర్వు చేసినట్టు ప్రకటించారు. మెదక్ జిల్లా మల్లనసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో వేములఘాట్ గ్రామంలో జూలై 28 నుంచి నిషేదాజ్ఞలు అమలులో ఉన్నాయి. గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిషేదాజ్ఞలను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ గ్రామస్తులు వై సంతోష్‌రెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వం, గ్రామస్తులు, పోలీసుల వాదనలు విన్న తర్వాత తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.