S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

అల్వాల్, సెప్టెంబర్ 23: అల్వాల్‌లో డ్రైనేజీ, వరద నీటి కాలువల సమస్య శాశ్వతంగా పరిష్కరించటానికి ప్రజలు సహకరించాలని రాష్ట్ర మంత్రులు కెటి రామారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం టెంపుల్ అల్వాల్ ప్రాంతంలో వరద నీటి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బొల్లారం, మల్కాజిగిరి ప్రాంతంలో భారీ వర్షం నమోదు కావటంతో అల్వాల్‌లో ఉన్న మూడు చెరువులు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయని, దాంతో వరద ఉద్ధృతంగా వస్తోందని ఆయన చెప్పారు. వర్షం కురిసినప్పుడే కాకుండా వర్షాలు వెలసిన తర్వాత స్థానిక శాసన సభ్యుడు చింతల కనకారెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌లు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సమావేశమై వరద నీటి కాలువలు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ముందుకు రావాలని, దీనిలో కొందరు త్యాగాలకు సిద్ధం కావాలని, ఎవరివైనా స్థలాలు పోతే వారికి తగిన నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు. వర్షం కురిసినప్పుడే కాకుండా వర్షాల తర్వాత కూడా అధికారులతో సహహరించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఎంత ఖర్చు చెయ్యటానికైనా సిద్ధంగా ఉందని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. వర్షాలు వెలిసిన తర్వాత వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తపడాలని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. ప్రభుత్వం చేసే పనులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్‌లు జితేంద్రనాథ్, విజయశాంతి రెడ్డి, సబిత, గ్రేటర్ కో-ఆప్షన్ సభ్యురాలు గొట్టిముక్కల జ్యోతి శ్రీనివాస్ గౌడ్, నాయకులు చింతల శ్రీనివాస్ రెడ్డి, అనిల్‌కిషోర్, గొట్టిముక్కల శ్రీనివాస్ గౌడ్, జిహెచ్‌ఎంసి కమిషనరు జనార్థన్ రెడ్డి, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ అడప రమేష్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యను కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.