S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఢిల్లీకి చెందిన టిటిఐ ఇంజనీర్లతో సివరేజీ మెయిన్ పైప్‌లైన్లను తనిఖీ చేసిన ఎండి

హైదరాబాద్, సెప్టెంబర్ 23: గ్రేటర్ హైదరాబాద్‌లోని సివరేజీ పైప్‌లైన్లపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు అధ్యయన కమిటీని జలమండలి ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ధ్వంసమైన 1800 ఎంఎం డాయ సివరేజీ మెయిన్ పైప్‌లైన్‌పై పూర్తి స్థాయి విచారణను వేగవంతం చేసింది. శుక్రవారం ఢిల్లీకి చెందిన టిటిఐ ఇంజనీర్ల బృందంతో కలిసి జలమండలి ఎండి ఎం.దానకిషోర్, ఇడి, ఇఎన్‌సి ఎం.సత్యనారాయణ.. సివరేజీ మెయిన్ పైప్‌లైన్ మరమ్మతుల పనులను తనిఖీ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్‌లో బుధవారం భారీ గొయ్యిపడింది. ఇక్కడి రోడ్డు క్రింద పాతకాలం నాటి 1800 ఎంఎం డయా భారీ పైప్‌లైన్‌కు గుంత ఏర్పడాటానికి కారణాలు గుర్తించిన అధికారులు పనులు ప్రారంభించారు. శుక్రవారం జలమండలి ఎండి ఎం.దానకిషోర్, ఇడి,ఇఎన్‌సి ఎం.సత్యనారాయణతో కలిసి సందర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ఎండి నిపుణులైన, వివిధ ప్రభుత్వ శాఖలో పనిచేసి రిటైర్డైన ఇంజనీర్లను సభ్యులుగా, ప్రస్తుతం జలమండలి ఇడి, ఇఎన్‌సిగా పనిచేస్తున్న ఎం.సత్యనారాయణను కన్వీనర్‌గా నియమిస్తూ అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. టిటిఐ కన్సల్టింగ్ ఇంజనీర్స్ న్యూఢిల్లీ అసోసియేట్ డైరెక్టర్ శశిభూషన్‌తో కూడిన బృందం కూడా ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏపడుతున్న సివరేజీ పనులను పరిశీలించారు. జలమండలి ఎడి మాట్లాడుతూ నగరంలో కూరుస్తున్న వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు జనరల్ మేనేజర్ స్థాయి అధికారులను 18 మందిని స్పెషల్ ఆఫీసర్‌లుగా నియమించామని తెలిపారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో అత్యవసర సెల్‌ను ఏర్పాటు చేసిన్నట్లు పేర్కొన్నారు. నగరంలో వర్షాలతో ఏర్పడే డ్రేనేజీ, వాటర్ సప్లైకి సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి ఫోన్ నెంబర్ 9989996948లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అత్యవసర సెల్‌లో అధికారులు అందుబాటులో ఉండి ప్రజలిచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పంధిస్తారు. జలమండలికి చెందిన మెట్రో కస్టమర్ కేర్ (ఎంసిసి) నెంబర్ 155313కి కూడా ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఎన్‌టిఆర్ మార్గ్‌లో చేపడుతున్న పనులను పరిశీలించిన వారిలో డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, సత్యసూర్యనారాయణ, డి.శ్రీ్ధర్‌బాబు ఉన్నారు.