S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పొంగిపొర్లుతున్న నాలాలు, చెరువులు

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23: భారీ వర్షాలకు శేరిలింగంపల్లిలోని చెరువులు, కుంటలు, నాలాలు, కాలువలు పొంగిపొర్లుతుండటంతో రోడ్లు జలదిగ్బంధం అయ్యాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరి నివాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి, బిల్డర్ల అక్రమాలు ఇప్పడు ప్రజలపాలిట శాపంలా మారాయి. చాలాచోట్ల నాలాలను కబ్జాచేసి అపార్టుమెంట్లు, భవనాలు నిర్మించడంతో ఇరుకుగామారి వరద నీరు రోడ్లపైకి ప్రవహిస్తుండటం ఇబ్బందికరంగా తయారైంది. దీప్తిశ్రీనగర్, శ్రీకృష్ణదేవరాయ కాలనీ, ఆదర్శనగర్, శాంతినగర్, కృషినగర్‌ల వద్ద పటేల్ చెరువునుంచి వచ్చే నాలాను కబ్జా చేయడంతో వరదనీరు కాలనీల్లో నుంచి పారుతుండడం ఇబ్బందిగా తయారైంది. మదీనగూడ ఈర్ల చెరువు నుంచి వచ్చే నాలాను ఆక్రమించి, దానిపై స్లాబు వేసి భారీ అపార్టుమెంట్లు నిర్మించడం వల్ల ఆ వరద నీరు కాలనీలను జలదిగ్బంధనం చేసింది.
మియాపూర్ రాయసముద్రం కుంట శిఖం భూమిలో కబ్జాలు చేసి ఇళ్ళు నిర్మించుకున్న ఆక్రమణదారులు చెరువుకట్టకు గండి పెట్టడంతో వరదనీరు నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. పైనుంచి వచ్చే వరద రోడ్డుపైకి వెళ్ళడం వల్ల మియాపూర్ - బాచుపల్లి రోడ్డును ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హఫీజ్‌పేట కాయిదమ్మకుంట అలుగు నీరు వెళ్ళే కాలువను కబ్జా చేసి జనప్రియనగర్ లేఅవుట్ చేయడంతో వరద నీరంతా కాలనీ రోడ్లపై నుంచే ప్రవహిస్తుండటం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. జవహర్ కాలనీ వద్ద నాలాను ఆక్రమించి ఇరువైపులా ఇళ్ళు కట్టడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. తారానగర్, లింగంపల్లి, హుడా ట్రేడ్‌సెంటర్ ప్రాంతాల్లో బిల్డర్లు నాలాను కబ్జాచేసి అపార్టుమెంట్లు నిర్మించినందున అది కుచించుకుపోయి రోడ్లపై నుంచి పారుతూ సమీపంలో ఉన్నవారికి నరకంగా తయారైంది. లింగంపల్లి ప్రభుత్వ పాఠశాల, పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నాలాను ఆక్రమించడమే కాకుండా దాన్ని మళ్ళించి భవనాలు, భారీ షెడ్లు నిర్మించడం వల్ల వరద నీరు అండర్ బ్రిడ్జి కిందకు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి కబ్జాలను కూల్చివేసి, నాలాలను వెడల్పు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
సహాయ చర్యలపై భరోసా
వరద ముంపు నుంచి కాపాడడానికి ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నామని హఫీజ్‌పేట, మాదాపూర్ కార్పొరేటర్లు వి.పూజిత, జగదీశ్వర్‌గౌడ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని మదీనగూడ, రామకృష్ణనగర్, కల్కి గార్డెన్స్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితులను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, సహాయ చర్యలు చేపట్టడానికి జిహెచ్‌ఎంసి అధికారుల బృందం రాత్రింబవళ్లు సిద్ధంగా ఉన్నారని, తాము అన్నివేళలా అందుబాటులో ఉంటామని కార్పొరేటర్లు తెలిపారు.
నాలాల కబ్జాలను కూల్చివేయాలి
నాలాల కబ్జాలను కూల్చివేసి యుద్ధప్రాతిపదికన వెడల్పు చేయాలని అధికారులకు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సూచించారు. శుక్రవారం చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీనగర్, శాంతినగర్, ఆదర్శనగర్, లోతట్టు ప్రాంతాలను శేరిలింగంపల్లి సర్కిల్-12 ఉప కమిషనర్ వి.మమత, జోనల్ ఎస్‌ఇ మోహన్‌సింగ్, సర్కిల్-12 ఎసిపి కె.మహిపాల్‌రెడ్డి, ఇఇ హన్మంతరావుతో కలిసి కార్పొరేటర్ పరిశీలించారు. ఆదర్శనగర్ వద్ద నాలాను ఆక్రమించి కట్టిన గోడను తొలగించి వరద నీరు పోవడానికి చర్యలు తీసుకున్నారు. నాలాలు కబ్జా చేసిన వారిని వదిలిపెట్టవద్దని, ఎంతటివారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేత బొబ్బ విజయ్‌రెడ్డి, జనపల్లి కృష్ణారెడ్డి, పోచయ్య, ఏనుగు వెంకటరెడ్డి, మిరియాల ప్రకాష్, రమణకుమారి, ఆశ పాల్గొన్నారు.
వరద బాధితులను ఆదుకోవాలి
వరద ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించి, ఆర్ధిక సహాయం అందించాలని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.్భక్షపతి యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం లింగంపల్లి, హుడా ట్రేడ్‌సెంటర్‌తోపాటు పలు బస్తీలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద నీటిలో మునిగిన గుడిసెవాసులకు పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు.
రోడ్డునపడ్డ గుడిసెవాసులకు తక్షణమే పునరావాసం కల్పించాలని, నష్ట పరిహారం చెల్లించాలని, పేదలకు పక్కా ఇళ్ళు కట్టించాలని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడిచెర్ల కృష్ణ, గ్రేటర్ సేవాదళ్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌రావు, కచ్చెర్ల ఎల్లేష్, రాంచందర్, లక్ష్మారెడ్డి, రామస్వామి, పాండు, దినేష్ బోహ్రా పాల్గొన్నారు.
ఉప్పొంగుతున్న డ్రైనేజీలు
బాలానగర్: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు కూకట్‌పల్లి జంట సర్కిళ్ళ పరిధిలో పొంగుతున్న నాలాలు, ఉప్పొంగుతున్న డ్రైనేజీల వల్ల లోతట్టుప్రాంతాలు, బస్తీలు జలమయమయ్యాయి. చెరువులను తలపిస్తున్న రహదారులపై వాహనాలు కదలకపోవడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఆయా రహదారులపై ఎక్కడ ఏగుంత ఉందో, మరెక్కడ మ్యాన్‌హోల్ తెరుచుకుందో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో తప్పని పరిస్థితిలో బయటకు వెళ్ళిన వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించడానికి జంకుతున్నారు. గత నాల్గు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాలాపరీవాహక ప్రాంతాలైన బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలోని దీనదయాల్‌నగర్, రాజీవ్‌గాంధీనగర్, అమృత్‌తండా, కల్యాణినగర్, నవజీవన్‌నగర్, ఇంద్రానగర్, నాగార్జుననగర్, చెరబండరాజునగర్ తదితర బస్తీలు వరదనీటికి పూర్తిగా జలమయమయ్యాయి. గత వారం రోజుల్లో ఆయాబస్తీలు జలమయమవడం ఇది రెండవసారి కావడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కూకట్‌పల్లి ఎమెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు పండాల సతీష్‌గౌడ్, కాండూరి నరేంద్రాచార్య ఎప్పటికపుడు ముంపుప్రాంతాలను పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదేపరిస్థితి ఎదురవుతుంది ముందస్తుగా వర్షాకాలంలో సర్కిల్ అధికారులు ఎలాంటి ప్రణాళికలు రూపొందించక పోవడంవల్ల ముంపు సమస్య తలెత్తుతుంది. 2000 సంవత్సరంలో ఇలాంటి విపత్తు సంభవించి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు ఆహారం, తాగునీరు వంటివి అందించడంలో ఎలాంటి సహాయం అందడంలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణం సహాయ చర్యలు తీసుకుని బాదితులను ఆదుకోవాలని చెరబండరాజునగర్‌కు చెందిన స్థానికుడు ఆర్‌వి తుకారం కోరారు. వర్షాకాలం వచ్చిందంటే వణుకు పుడుతోంది. నాలాలు ఆక్రమణకు గురవడంతో వర్షాకాలంలో వరదతాకిడికి బస్తీలు నీటిముంపునకు గురవుతున్నాయి. ముంపునకు గురైన ప్రాంతాలలో వరదనీటిని మళ్ళించి పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు తగిన సిబ్బందిని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఫతేనగర్ దీనదయాల్‌నగర్‌కు స్థానికురాలు అనూష కోరారు.
కోలుకోని బస్తీలు
బేగంపేట: నగరంలో మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో ఆయా కాలనీల ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. బేగంపేట డివిజన్‌లో కూకట్‌పల్లి నాలా నుంచి వరదనీరు వస్తుండడంతో ఆయా కాలనీలు, బస్తీలు శుక్రవారం కూడా మునిగి వున్నాయి. బ్రాహ్మణవాడి, అల్లంతోటబావి, మయూరిమార్గ్, వడ్డెరబస్తీ, మాతాజీనగర్ ప్రాంతాల్ని సందర్శించిన మంత్రులు కెటిఆర్, తలసాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించడంతో సిబ్బంది సహాయ పునరావాస చర్యలు, భోజన సదుపాయం కల్పించారు. ముందు జాగ్రత్త చర్యగా హెల్త్ శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికి మందులు అందజేసారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం.కృష్ణారావు, బేగంపేట కార్పొరేటర్ తరణి పరిస్థితిని అధికారులతో చర్చిస్తున్నారు.
రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్
భవనం కూల్చివేతకు నోటీస్
రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పురాతన భవనంలో ఉండడంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఇదివరకే నోటీసులు జారీ చేసారు. శుక్రవారం మంత్రి తలసాని పోలీసుస్టేషన్‌ను సందర్శించి మాట్లాడుతూ, పురాతన భవనాల కూల్చివేతలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. సికింద్రాబాద్‌లో 300పైగా పురాతన భవనాలు వున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రితోపాటు కార్పొరేటర్ ఎ.అరుణగౌడ్, ఆర్‌డిఓ రఘురామశర్మ, జిహెచ్‌ఎంసి ఏసిపి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వ్యక్తి మృతి
రసూల్‌పుర ఇందిరమ్మనగర్‌లో నివసిస్తున్న సంతోష్ (35) ఇంట్లో మూడు రోజులుగా వరద నీరు వస్తుంది. శుక్రవారం ఉదయం సంతోష్ భార్య పిల్లలను వేరేచోటకు వెళ్లాలని సూచించగా ఆమె పుట్టింటికి వెళ్లింది. సంతోష్ ఇంట్లోనే ఉండడంతో చలికి మృతి చెందినట్లు ఎస్.ఐ రాంచందర్ తెలిపారు.