S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైవిధ్యమే రక్ష!

టాలీవుడ్‌లో లావణ్య త్రిపాఠి బిజీ బిజీగా మారబోతోంది. ఇప్పటికే చేతిలో మూడు సినిమాలున్నాయి. మరో రెండింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. టాలీవుడ్‌లో ప్రవేశిస్తున్న తారలంతా ముందుగా గ్లామర్ పాత్రలవైపే చూస్తున్నారు. గ్లామరే కెరీర్‌ను రక్షిస్తుందని కలలు కూడా కంటున్నారు. కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే గ్లామర్‌తో యువతను కట్టిపడేయాలనుకుంటున్నారు. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం అందుకు పూర్తి విరుద్ధం అంటోందిట. ఈ విషయం గురించే చెబుతూ- ‘‘ఏ నటి అయినా కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే వైవిధ్యమైన పాత్రలు చేయాలి. అలాంటప్పుడే నటికి భవిష్యత్తు వుంటుంది. కెరీర్‌లో ఎదిగేందుకు అలాంటి పాత్రలే దోహదపడతాయి. గ్లామర్‌ని నమ్ముకున్న తారల కెరీర్ కాలం మనం చూశాం. వారు ఎంతో కాలం నిలవలేదు. అలాగని అంతా వైవిధ్యమే అనుకుంటే పొరపాటే.. పాత్రకనుగుణంగా చేస్తూ నటనకు అవకాశమున్న క్యారెక్టర్స్‌పై దృష్టి సారించాలి. అప్పుడే నటిగా మనమేంటో తెలుస్తుంది. అలాగే కెరీర్‌ను కాపాడుకోగలుగుతాం. తెలుగులో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. వాటిని చేస్తూ నటిగా నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నా’’అంటూ చెప్పుకొచ్చింది లావణ్య. చూద్దాం..అన్నమాట మీదే నిలబడుతుందో..లేదో!!

-సమీర్