S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కెసిఆర్‌ది నియంతృత్వ పాలన

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ది నియంతృత్వ పాలన కొనసాగుతుందని అందులోని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఒక్క అధికారం లేకుండా చేశారని టిడిపి రాష్ట్ర నిర్వహక కార్యదర్శి, జడ్చర్ల టిడిపి మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆరోపించారు. సోమవారం జిల్లా టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు తీవ్ర ఆవేదనలో, అప్పుల్లో కురుకుపోయారని ఎన్నికల సమయంలో కెసిఆర్ ఇచ్చిన హామీతోనైన బయటపడుతామని అనుకుని టిఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారని తీరా అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులను మోసం చేసి పంట రుణమాఫికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఓ పక్క వర్షాలు, మరోపక్క వర్షాలకు ముందు సరిగ్గా వర్షాలు కురియక పంటనష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. తక్షణమే పంట నష్ట అంచనాలు వేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాలకు మహబూబ్‌నగర్ జిల్లాలో వందలాది ఇళ్లు కూలీపోయాయని అలాంటి భాదితులకు డబుల్ బెడ్‌రూంలో ఇళ్లు మంజూరు చేసి నిర్మించాలని కోరారు. లక్ష రుపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసి రైతులను అదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు దెబ్బతిన్నాయని దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలో ఇంటికో ఉద్యోగం ఎమైందని ఆయన ప్రశ్నించారు. టిడిపి ప్రజల పక్షాన ఉంటే వారికి కడుపు మంటలా ఉందని ఎద్దెవా చేశారు.