S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యం

కల్వకుర్తి, సెప్టెంబర్ 26: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ సాధనే అఖిలపక్షం లక్ష్యమని, రెవెన్యూ డివిజన్ కోసం చేస్తున్న దీక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గత 35 రోజులుగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కేంద్రంతో పాటు కడ్తాల, చారకొండలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో దీక్షలను కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం జెఎసి శిబిరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఎల్‌ఐసి ఎజెంట్‌లు బాలస్వామిగౌడ్, సత్య నారాయణ, వెంకటేష్, లింగం, బంగారయ్య, మహేష్, వెంకటయ్య, కృష్ణయ్య, నాగరాజు, లక్ష్మయ్య, అంజనేయులు, నరేష్‌లు కూర్చున్నారు. ఈ రిలే దీక్షలను అఖిలపక్ష నాయకులు యడ్మ కిష్టారెడ్డి, మిర్యాల శ్రీనివాస్‌రెడ్డి, దుర్గప్రసాద్, సత్యం, జంగయ్య, జనార్థన్‌రెడ్డి, దుర్గసాగర్, గంగాధర్‌లు పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ రిలే దీక్షను స్థానిక ఎమ్మెల్యే చల్లావంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్‌రెడ్డిలు రిలే దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.