S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

షాద్‌నగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి

షాద్‌నగర్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేందుకు షాద్‌నగర్ పురపాలక సంఘాన్ని అభివృద్ది చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఈడెన్ పంక్షన్ హాల్‌లో బహిరంగ మల విసర్జన రహిత పట్టణం ధృవపత్ర ప్రధాన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలిక సంఘం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టగా పనిచేస్తే అభివృద్ది వేగవంతంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సూచించారు. పురపాలిక సంఘాల అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన అభివృద్ది పనులు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోనే షాద్‌నగర్ పురపాలిక సంఘం ఆదర్శంగా నిలించేందుకు కృషి చేయాలని అన్నారు. షాద్‌నగర్‌లో ప్లాస్టిక్ కవర్లను నిషేదించడం గర్వంగా ఉందని వివరించారు. ప్లాస్టిక్ వస్తువుల కారణంగా వాతావరణం పూర్తిగా కాలుష్యమైపోతుందని, దీంతో వర్షాలు తగ్గిపోతున్నాయని వివరించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగులను, పేపర్ కవర్లను వాడుకలోకి తీసుకువచ్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయిస్తే వారికి జరిమాన విధించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ అధికారులు, కౌన్సిలర్ల సమీష్టి కృషి వల్లే బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై పురపాలిక సంఘం అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పురపాలిక సంఘం అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తున్నారని, ఈ సంధర్భంగా కమీషనర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ మలవ విసర్జన రహిత ధృవపత్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కమీషనర్ రామాంజులరెడ్డికి అందజేశారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను పూలమాలలు, శాలువాలతో కౌన్సిలర్లు, పురపాలిక అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రాహుల్‌సింగ్, పురపాలిక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, వైస్ చైర్మన్ వన్నాడ లావణ్య, కౌన్సిలర్లు ఆసియాభేగం, భ్యాగరి మాణెమ్మ, యుగందర్, ప్రతాప్‌రెడ్డి, సుధాకర్, కొంకళ్ల చెన్నయ్య, రాజేందర్‌రెడ్డి, భ్రమరాంబ, కృష్ణవేణి, విజయ్‌కుమార్‌రెడ్డి, రేటికల్ మీన, భీమమ్మ, ప్రమీల, లక్ష్మణ్‌గౌడ్, మహేశ్వరీ, విజయశ్రీ, మహమూదాభేగం పాల్గొన్నారు.