S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూడు వరుసల్లో మొక్కలు నాటాలి

కొత్తూరు, సెప్టెంబర్ 26: జాతీయ రహదారికి ఇరువైపుల రెండు లేదా మూడు వరసల్లో మొక్కలు నాటేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం కొత్తూరు మండలం తిమ్మాపూర్ రిసార్ట్‌లో హరితహరం కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. కొత్తూరు మండలంలోని జాతీయ రహదారికి ఇరువైపుల ఉన్న అనుబంధ రహదారులపై రెండు లేదా మూడు వరసల్లో మొక్కలు నాటి రక్షించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు. ఒక్కొక్క మొక్కకు కంచెను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 140రూపాయలు ఇస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అసక్తి గల సర్పంచులు ముందుకు వస్తే వారికి ఒక్కొక్క మొక్కకు 180రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. 180రూపాయల్లో మొక్కతోపాటు గుంత, కంచెను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కకు విధిగా కంచెను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో సంబంధిత శాఖ అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఉపాధి హామీ పథకంగా ద్వారా గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటించేందుకు సర్పంచులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని వర్గాల ప్రజలు, అధికారులు సహకరించాలని సూచించారు. జాతీయ రహదారి గుండా మొత్తం ఒక లక్ష మొక్కలు నాటడం టార్గెట్‌గా ఉండగా ఇప్పటి వరకు 40వేల మొక్కలు నాటడం జరిగిందని వివరించారు. రహదారి వెంబడి నాటిన మొక్కను సంరక్షించేందుకు అధికారులతో పాటు సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో 40వేల మొక్కలు విధిగా నాటేందుకు సర్పంచులు కృషి చేయాలని అన్నారు. ఎక్కడ మొక్కలు నాటిన వాటిని పూర్తి స్థాయిలో రక్షించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్, డ్వామా పిడి దామోదర్, తహశీల్దార్ నాగయ్య, ఎంపిడివో జ్యోతి, ఆటవీ శాఖ అధికారులు, సర్పంచులు జెనిగె జగన్, శ్రావన్‌కుమార్, ఏనుగు జనార్ధన్‌రెడ్డి, ఎంపిటిసి సభ్యుడు బి.దేవేందర్ యాదవ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.