S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాబు పాలనతో ఒరిగింది శూన్యం

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 26: నెరవేరని హామీలతో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని నియోజకవర్గం వైసిపి సమన్వయ కర్త గొర్లె కిరణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం ఎస్‌ఎం పురం గ్రామంలో గడపగడపకూ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు సంక్షేమాన్ని పక్కన పెట్టి అసమాన్యులకు రాయితీలు ఇస్తూ బాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఎటువంటి నియామకాలు చేపట్టకపోవడంతో నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సాగునీరు, మంచినీరు సమస్యను పరిష్కరించకుండా గ్రామాలకు కావాల్సిన నిధులు కేటాయించకుండా దోమలపై దండయాత్ర అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేకమంది విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాల వంటి అంటువ్యాధులు ప్రబలి మృత్యువాత పడుతుంటే ఎటువంటి నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందని విమర్శించారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జన్మభూమి కమిటీల పేరిట కార్యకర్తలకు దారాదత్తం చేసి ప్రజాదనాలను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పాలనకు ప్రజలు స్వస్తిపలికే రోజులు ఆసన్నమయ్యాయని ప్రజల పక్షాన పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని మీరంతా బలపరచాలని కిరణ్‌కుమార్ కోరారు. ఈయనతోపాటు మాజీ ఎంపిపి బల్లాడ జనార్దనరెడ్డి, నక్క కృష్ణమూర్తి, జరుగుళ్ల శంకరరావు, కెవివి సత్యన్నారాయణ, సనపల బాలకృష్ణ, కోన సూర్యారావు, కింతలి ఈశ్వరరావు, సనపల సూరిబాబు, సీరపు శ్రీరామమూర్తి, ఏ.నర్శింహమూర్తి, డొంక అప్పలరాజు, దుంప చిన్నారెడ్డి, అంబటి శ్రీనివాసరావు ఉన్నారు.