S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

టిడిపి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

సీతంపేట, సెప్టెంబర్ 26: నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసేదానికి కార్యకర్తలను భాగస్వాములు చేసేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని టిడిపి రాష్ట్ర పార్టీ కార్యదర్శి, పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడు యర్రా వేణుగోపాలరాయుడు చెప్పారు. మండలంలోని పెదరామ గ్రామంలో సోమవారం రుణమాఫీ పత్రాల పంపణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేక వ్యాధులకు కారణమైన దోమలపై దండయాత్ర కార్యక్రమం పెట్టి అవగాహన పెంచేలా సమావేశాలు పెట్టామన్నారు. సంక్షేమ పథకాలు, వౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి అభివృద్థి అంశాలకు సమపాలలో ప్రాధాన్యతనిస్తు టిడిపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్థి కార్యక్రమాల పై కనీస అవగాహన లేకండా ప్రతిపక్షం అర్థంలేని ఆరోపణలు చేస్తుందన్నారు. ఏలూరు యువభేరి సభలో జగన్‌చేసిన వ్యాఖ్యలు అవగాహనలేమిని తెలియజేస్తున్నాయన్నారు. ప్రొఫెసర్ కన్సల్టెంట్‌లను పక్కన పెట్టుకొని వారి సూచనలతో పార్టీని నడిపే పరిస్థితికి వైసిపి దిగజారిపోయిందని విమర్శించారు. ప్రత్యేక హోదా పై ప్రతిపక్షాలు చేస్తున్న రగడ అర్థంలేనిదని అన్నారు. హోదాయే కావాలని పిల్ల,తల్లి కాంగ్రెస్‌పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థంచేసుకున్నారన్నారు. డిసెంబర్‌లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో శ్రీకాకుళం,రాజాం మున్సిపాలిటీల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా పాలకొండ పార్టీ నియోజకవర్గ బాధ్యులు జయక్రిష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతలో స్థానిక సర్పంచ్‌లకు తెలియకుండా అధికారులు రుణమాఫీ పత్రాలు పంపిణీ చేసినట్టు ఆరోపించారు.
జిల్లా కో ఆప్షన్ సభ్యులు సవరతోట మొఖలింగం,మార్కెట్ కమిటీ చైర్మన్ చింత సంగంనాయుడు,తెదేపా నాయకులు చంద్రరావు,ప్రకాశం,మురళి తదితరులు పాల్గొన్నారు.