S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రీడలు జీవితంలో అంతర్భాగం

బలగ, సెప్టెంబర్ 26: క్రీడలు జీవితంలో అంతర్భాగమని, క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో బెహరా మనోవికాస కేంద్రం నిర్వహణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితానికి విద్యతో పాటు ఆటా, పాటా అవసరమన్నారు. పురుషులతో సహా మహిళలు క్రీడలలో కూడా రాణిస్తున్నారని, ఇటీవల జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధూ ఒక మహిళ అని గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ బిడ్డలు క్రీడలలో పాల్గొనే విధంగా చొరవచూపాలని కోరారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందని, ఇందులో గెలుపు ఓటములకు తావుందన్నారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపేవిధంగా తగిన తర్ఫీదు శిక్షకులు ఇవ్వాలని ఆదేశించారు. అంతకుముందు దివ్యాంగుల క్రీడలకు హాజరయ్యే 250మంది క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు. బ్యాండ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బోసి(బంతి) క్రీడల్లో పతకాలు సాధించి రాష్టస్థ్రాయి క్రీడలకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్టస్థ్రాయి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు మరింత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రీడాకారులకు క్రీడాస్ఫూర్తి అవసరమని తద్వారా క్రీడలలో విజయాలను సాధించగలరన్నారు. అనంతరం దివ్యాంగుల క్రీడలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవిలతో కలిసి బోసి, 50మీటర్ల పరుగుపందేలను ప్రారంభించారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు స్వర్ణ, రజిత, కాంస్య పతకాలను ధృవీకరణ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు కెవి ఆదిత్యలక్ష్మి, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎం.బాబూరావు, వర్శిటీ రిజిస్ట్రార్ జి.తులసీరావు, రాష్టద్రివ్యాంగుల క్రీడల సహాయ సంచాలకుడు సి.రాజశేఖర్, బెహరా మనోవికాస కేంద్రం కార్యదర్శి సిహెచ్ విజయభాస్కరరావు, ఫిజికల్ డైరెక్టర్ మోహన్‌రాజ్, గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు గీతాశ్రీకాంత్, వివిధ మనో వికాస కేంద్రాల విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.