S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలవరానికి నిధుల దన్ను

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: పోలంవరం ప్రాజెక్టు నిర్మాణానికి తొలి విడత రుణం ఇచ్చేందుకు నాబార్డ్ అంగీకరించింది. వచ్చే నెల 15నుంచి తొలి విడత రుణం విడుదల మొదలు కానుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఢిల్లీలో సోమవారం సుజనా చౌదరి అధ్వర్యంలో నాబార్డ్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జల వనరుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నాబార్డ్ చైర్మన్ హర్షకుమార్ భన్వాల్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రమేశ్, రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రాజెక్టు అథారిటీ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం వంద శాతం నిధులు సమాకూర్చనుందని, దీనికి సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై సమావేశంలో చర్చించామని
చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చే మూడేళ్లలో నాబార్డు నిధులు సమాకూర్చనుందని, 2018నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నాబార్డ్ రుణం మంజూరు చేయడానికి, రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎంకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించనుందని, అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి నాబార్డ్ రుణం ఇస్తున్నందున, రుణం మంజూరు విషయంలో రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎంను పరిగణనలోకి తీసుకోరని వెల్లడించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని తాజా గణాంకాల ప్రకారం లెక్కిస్తారని, ఆ ప్రకారం నిర్మాణ ఖర్చు రూ.16వేల కోట్లు అవుతుందని చెప్పారు. ఈ నిధులతోపాటు పరిహారం, పునరావాసం, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా అందిస్తారని చెప్పారు.