S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మావల్ల కాదు!

హైదరాబాద్, సెప్టెంబర్ 26: దేశవ్యాప్తంగా జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, జాతీయ అర్హత పరీక్షల నిర్వహణ తమ వల్ల కాదని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ)చేతులెత్తేసింది. యూనివర్శిటీలతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకానికి, పిహెచ్‌డి అడ్మిషన్లలో ప్రాధాన్యతకు నెట్ అర్హత ఉపయోగపడుతుంది. ఇక మీదట ఆ బాధ్యతను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ చూసుకోవాలని పేర్కొంది. ప్రతి ఏటా రెండు సార్లు నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతున్నారు. వారికి అర్హత సర్ట్ఫికేట్ల జారీ, పరీక్ష ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్ష కేంద్రాల గుర్తింపు, యూనివర్శిటీలతో సమన్వయం పెద్ద సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 89 పట్టణాలను గుర్తించారు. మొత్తం 100 సబ్జెక్టుల్లో నెట్‌ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 850 విశ్వవిద్యాలయాలతో సమన్వయాన్ని సాధించాల్సి వస్తోంది. పరీక్ష ప్రశ్నాపత్రాల రూపకల్పన వరకూ సిబిఎస్‌ఇ బాధ్యత తీసుకుంటుండగా, పరీక్షల నిర్వహణ బాధ్యత మాత్రం ఆయా యూనివర్శిటీల్లోని ఒక సీనియర్ ప్రొఫెసర్‌కు అప్పగిస్తున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, హాల్‌టిక్కెట్ల జారీ, పరీక్ష నిర్వహణ తదితర బాధ్యతలు అన్నీ ఆయా వర్శిటీలే చూసుకోవల్సి ఉంటుంది. అందుకోసం 743 మంది మెంబర్ సెక్రటరీలను నియమిస్తున్నారు. వీరికి తోడు ప్రతి యూనివర్శిటీ పరిధిలో దాదాపు వెయ్యి మంది వరకూ పరీక్ష నిర్వహణకు ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది, పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లను నియమిస్తున్నారు. ఇదో పెద్ద ప్రహసనంగా మారిందని, దీంతో సిబిఎస్‌ఇ తన అసలు లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతోందని సిబిఎస్‌ఇ కొత్త చైర్మన్ రాజేష్ కుమార్ చతుర్వేది చెప్పారు. రానున్న రోజుల్లో సిబిఎస్‌ఇ తన కీలకమైన బాధ్యతలను నెరవేర్చే పనిలో పడనుందని, అందుకే నెట్ బాధ్యతను తిరిగి యుజిసికే అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి నెట్ బాధ్యతలు యుజిసి తీసుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.