S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వైద్య శాఖలో 2118 పోస్టులు

హైదరాబాద్, సెప్టెంబర్ 26: వైద్య ఆరోగ్య శాఖలో త్వరలోనే 2118 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వైద్య ఆరోగ్య మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రక్రియ పూరె్తైందని, నియామకపు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందన్నారు. వీటితోపాటు మరి కొన్ని పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. నియామకాలు పూరె్తైతే ప్రభుత్వ వైద్య శాలల్లో సిబ్బంది కొరత తీరిపోతుందన్నారు. రెండు వారాల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సోమవారం పురాతనమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. పాత భవనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆస్పత్రి సూపరిండెంట్‌కు సూచించారు. ఉస్మానియాలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ఉస్మానియాలో ఔట్ పేషెంట్ల సంఖ్య 20శాతం పెరిగినట్టు మంత్రి తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రి భవనం వందేళ్ల క్రితం నాటిదని, ప్రస్తుత భవనం ఉన్న చోట కొత్త భవనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. త్వరలోనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కొత్త భవనం నిర్మించేంత వరకు పాత భవనంలోనే వైద్య సేవలు అందించనున్నట్టు చెప్పారు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలువ ఉందని, దీనితో రోగాలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో గత మూడు రోజులుగా 37 క్యాంపుల ద్వారా 22వేల మందికి చికిత్స అందించామని, వందమంది వైద్యులు, 512మంది సిబ్బంది, 17 అంబులెన్స్‌లు, 72మంది అంబులెన్స్ సిబ్బంది పని చేస్తున్నారన్నారు. త్వరలోనే కొత్త శానిటేషన్ విధానం ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత విధానంకన్నా మెరుగైన విధానం కోసం కసరత్తు చేస్తున్నట్టు లక్ష్మారెడ్డి తెలిపారు.

చిత్రం.. ఉస్మానియాలో రోగులతో మాట్లాడుతున్న వైద్య మంత్రి లక్ష్మారెడ్డి