S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాలకు కోట్లు.. రైతులకు పాట్లు

కోదాడ, సెప్టెంబర్ 26: ప్రకృతి అనుకూలించకపోవడంతో కరవుతో అల్లాడుతున్న రైతులను ఆదుకోవడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు, బతుకమ్మలకు మాత్రం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని తెలంగాణ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ ధ్వజమెత్తారు. కోదాడలో సోమవారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ఆయన విమర్శించారు. రైతులకోసం ప్రకటించిన లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి విడుదల చేస్తే రైతుల అప్పులు తీరేవని ఆయన చెప్పారు. అలా చేయకుండా ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు విడతలుగా విడుదల చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ జరగని కారణంగా రైతులకు కొత్తరుణాలు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడం వలన విడుదల చేస్తున్న మొత్తం వడ్డీకి సరిపోవడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం పంటరుణంపై వడ్డీలేదంటుంటే బ్యాంకర్లు మాత్రం 4 శాతం నుండి 9 శాతం వడ్డీని వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతులు పండించిన ఏ పంటకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం కల్పించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఒకేసారి రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేసి రైతులను రుణవిముక్తులను చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు. రైతులపై వడ్డీ భారాన్ని తొలగించి కొత్తరుణాలను ప్రతి రైతుకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొల్లు వెంకటేశ్వర్‌రావు, రావెళ్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కోదాడలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్