S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కొత్త రూట్లలో ఆర్టీసి బస్సులు

హైదరాబాద్, సెప్టెంబర్ 26: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసి కొత్త రూట్లలో పలు బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఆర్టీసి ఐదు కొత్త రూట్లలో బస్సులు ప్రారంభించినట్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. రూట్ 16డి, సికిందరాబాద్ నుంచి దమ్ముగూడ వరకు మూడు బస్సులు, నేరేడ్‌మెట్ క్రాస్‌రోడ్స్, సైనిక్‌పురి క్రాస్‌రోడ్స్, నేతాజినగర్, ఓల్డ్ కాప్రా మీదుగా ఈ కొత్త బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రూట్ నెం. 17 హెచ్‌ఎస్/90 కుషాయిగూడ నుంచి ఎన్జీవోస్ కాలనీకి నాలుగు బస్సులు నడుపుతారు. ఈసిఐఎల్ క్రాస్‌రోడ్డు, హెచ్‌బికాలనీ, మల్లాపూర్, నాచారం, హెచ్‌ఎంటి నగర్, హబ్సిగూడ, ఎన్‌జిఆర్‌ఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, నాగోల్ క్రాస్‌రోడ్డు, ఎల్‌బినగర్ క్రాస్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రూట్ నెం. 186, ఎన్జీవోస్ కాలనీ నుంచి కెపిహెచ్‌బి కాలనీకి ఎనిమిది బస్సులు నడుపుతున్నట్టు ఈడి పురుషోత్తం తెలిపారు. ఈ బస్సులు ఎల్‌బినగర్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, తార్నాక, సికిందరాబాద్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల మీదుగా నడుస్తాయి. రూట్ నెం. 6ఎన్‌జి ఈసిఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి గచ్చిబౌలికి 13 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతారు. హెచ్‌బికాలనీ, మల్లాపూర్, నాచారం, హబ్సిగూడ, తార్నాక, విద్యానగర్, నారాయణగూడ, లక్డికాపూల్, మెహిదీపట్నం మీదుగా వీటిని నడుతామని ఈడి పేర్కొన్నారు. అదేవిధంగా రూట్ నెం. 229/279, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నంకు నాలుగు బస్సులు నడుపనున్నారు. ఈ బస్సు సర్వీసులు కొంపల్లి, సుచిత్ర, బోయిన్‌పల్లి, ప్యాట్ని, తార్నాక, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, నాగోల్, సాగర్ క్రాస్‌రోడ్స్, బిఎన్‌రెడ్డినగర్ మీదుగా నడుస్తాయని పురుషోత్తం వివరించారు.