S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా జీవితంలో భయమంటే తెలీదు

గుంటూరు, సెప్టెంబర్ 26: ‘నాది సుదీర్ఘ రాజకీయ జీవితం. నాలుగు దశాబ్దాల కాలంలో నిప్పులా బతికాను. నీతి నిజాయతీగా ఉన్నా. వ్యాపార లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలకు తావివ్వద్దని స్వయానా కుటుంబ సభ్యులకే చెప్పా. నా అనుభవం అంత వయసులేని వాళ్లు అపనిందలు వేస్తున్నారు. ప్రజల కోసం అన్నీ సహిస్తున్నా. నా జీవితంలో భయమంటే ఏమిటో తెలియదు’.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు వైసిపి జెడ్పీసిసిలు, కౌన్సిలర్లు, ఎంపిటిసిలు సోమవారం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈసందర్భంగా కార్యకర్తల నుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని ఏ చట్టంలో ఉందో తేల్చాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీనిపై దుష్ప్రచారం చేస్తూ తమ పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించాలనుకోవటం ఆ పార్టీకే నష్టమన్నారు. హోదాకు మించిన ప్యాకేజీకి కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. ‘ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకున్నాం. సంక్షోభం నుంచి బయటపడాలి. మరోవైపు రాజధాని, పోలవరం నిర్మాణాలు జరగాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రంతో తెగతెంపులు చేసుకోవాలనడం అభివృద్ధిని అడ్డుకోవటమే’ అని చంద్రబాబు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సినవన్నీ సాధిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షం ఉన్మాదంగా వ్యవహరిస్తోందని, ప్రజల ప్రయోజనాలు వారికి పట్టటంలేదని విమర్శించారు.