S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎలా వుందీ వారం? ( అక్టోబర్ 2 నుండి 10 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

అంచనా మేరకు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు బదిలీలు, వ్యాపారస్థులకు విస్తరణ అవకాశాలు. విద్యార్థులకు పోటీ పరీక్షల ప్రణాళికలు, విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విందులు, వినోదాల్లో ఇష్టులతో కలసి పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. డబ్బు విషయంలో అప్రమత్తత అవసరం. అతిగా ఇతరులను నమ్మవద్దు. కుటుంబ సభ్యులతో అనుకూలం. అనుకోని వొత్తిడులు ఉండే అవకాశం. దంపతుల యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం తృప్తినిస్తుంది. శత్రువులపై ఆధిక్యత. వాహన ప్రాప్తి. స్పెక్యులేషన్ మిశ్రమం.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

సామరస్యంతో కార్యసిద్ధి. అధికారుల మన్ననలు అందుకుంటారు. అనుకోని ప్రదేశాలకు బదిలీలు. ప్రమోషన్లు అందుకుంటారు. ఆదాయ లావాదేవీలకై అనుకున్న ప్రయత్నాలు ఆలోచింపజేస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో సంయమనం పాటించండి. నూతన వ్యక్తుల పరిచయాలు మెరుగవుతాయి. వ్యాపారాలందు చెల్లింపులకు ధనం సర్దుబాటు చేసుకోవాలి. విద్య, వైద్య రంగాల్లో కొత్త ప్రణాళికలు మెరుగవుతాయి. కుటుంబం లాభాల బాటన పడుతుంది. అవమానాలు లెక్కచేయకండి. అనవసర ఆలోచనలను వాయిదా వేయండి.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ఆదాయ వ్యవహారాలకు ప్రణాళికలు అవసరం. ఆస్తి వ్యవహారాలందు అప్రమత్తత అవసరం. ఇతరుల వ్యవహారాలందు జోక్యం వద్దు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్పెక్యులేషన్ మిశ్రమ ఫలితాలనిస్తుంది. అనుకున్నవి ఆలస్యంగా నెరవేరుతాయి. అతి ఆలోచనలు కూడదు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించండి. ముఖ్యమైన పత్రాలు చేజారే అవకాశాలున్నాయి. అందరినీ ఒకేలా చూడకండి. యంత్రాలు, వాహనాల ఉపయోగంలో నియంత్రణ అవసరం. స్ర్తిలు ఖరీదైన ఆభరణాలు పొందుతారు. శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రత్యేక గుర్తింపు పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

ఇరకాటంలో పడకుండా పనులలో నేర్పును ప్రదర్శిస్తారు. హితులు మీకు ఇబ్బందికరంగా కొన్ని విషయాల్లో తలదూరుస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. ప్రభుత్వంతో కావలసిన పనులు అనుకూలిస్తాయి. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం తృప్తినిస్తుంది. ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మధ్యవర్తిత్వంతో గుర్తింపు మీరు కోరుకుంటారు. ఆటంకాలున్నా ప్రయాణాలు, కొన్ని పనులు మెరుగవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి సిబ్బంది, మిత్రుల సాయంతో బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు రాణిస్తాయి. ఆదాయ వ్యయాలు పోటీ మీద ఉంటాయి. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. ఆలోచనలతో పనులు మెరుగవుతాయి. వృధా ప్రయాసకు గురికావద్దు. పట్టుదలతో పనులు పూర్తి చేయటమే మేలు. జాయింట్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అనుకూల ధోరణితో ముందుకు సాగండి. స్ర్తిల సాయం పొందుతారు. స్పెక్యులేషన్ మిశ్రమం. అనవసర విషయాలలో తలదూర్చవద్దు.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

స్వశక్తితో ముఖ్యమైన సమస్యల నుండి బయటపడనున్నారు. సంతానం ద్వారా వున్న ఇబ్బందులను పరిష్కరించుకొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల వారు పరిష్కార మార్గాల ద్వారా మేలైన ఫలితాలను అందుకుంటారు. మక్కువతో పనులు పూర్తి చేయాలి. ఉద్యోగ వ్యవహార రంగాల వారికి బదిలీలు అనుకూలం. ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. అధికారుల వద్ద పనులు ఆలస్యమవుతాయి. ప్రయాణాలు, విందు వినోదాలందు హితులతో కలిసి పాల్గొంటారు.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

మానసిక సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతారు. మీ మార్గదర్శకత్వంలో పనులు పూర్తవుతాయి. వాహన, యంత్రాదులందు మార్పులు చేర్పులుంటాయి. అనుకోని ప్రయాణాలను నివారించండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసరంగా మాటలు పెంచకండి. స్ర్తిలు అన్ని వ్యవహారాలలో నియంత్రణ పాటించాలి. స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులుంటాయి. ఆలోచనలకు ముందుకు వెళ్లండి. ఆదాయ వ్యవహారాలు మెరుగవుతాయి. ధన సహాయం అందుతుంది.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

వివాదాల నుంచి మెల్లిగా బయటపడతారు. ఇతరులతో మాట్లాడేటపుడు తగు జాగ్రత్తగా మెలగండి. వ్యాపార విస్తరణ, నూతన వ్యాపారాలు మంచి ఫలితాలనిస్తాయి. స్ర్తిలు మాటపట్టింపులకు పోవద్దు. ఆర్థిక సమస్యలున్నా పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్థులు ఒత్తిడిని తట్టుకుని వ్యవహరించాలి. అనుకోని వ్యవహారాలందు ఇరుక్కున్నా చాకచక్యంతో బయటపడనున్నారు. శుభ వర్తమానాలు ఆనందాన్నిస్తాయి. సహ ఉద్యోగుల సాయం మెరుగవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

మనోనిబ్బరంతో ఊహించని సమస్యలు పరిష్కరించుకొంటారు. స్ర్తిలు ఖర్చులను నియంత్రించుకోవాలి. ప్రయాణాలందు అపశృతులు లేకుండా మెలగాలి. వృత్తి, వ్యాపారాలు శ్రమానుకూలం మెరుగవుతాయి. స్ర్తిలు ఇతరులకు సాయం చేసినా, ప్రతికూలతలు ఎదురు కాకుండా చూసుకోవాలి. వృత్తి, వ్యాపార విస్తరణలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ప్రైవేటు ఉద్యోగులు నిశ్చలతను పొందుతారు. మనశ్శాంతితో మెలగుతారు. అన్నింటా పట్టుదల అవసరం. అన్ని రంగాల్లోనూ రాణింపు ఉంటుంది. స్పెక్యులేషన్ మిశ్రమం.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

అన్ని కార్యాలు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మెరుగవుతాయి. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి. సంతాన సౌఖ్యం. భార్యాభర్తల మధ్య అవగాహన మెరుగవుతుంది. బంధుమిత్రుల సహకారాలు అందుకుంటారు. ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు, అవాహితులకు అనుకూలమైన సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. మెరమెచ్చులకు పోకండి. వాదులాటలకు దిగకండి. పట్టుదల మీకు రక్ష. శుభకార్యాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు మెరుగవుతాయి. తోటివారి సాయం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

వ్యాపార, వృత్తి రంగాల వారు ఆలోచనలను మెరుగుపరచుకోవాలి. శుభకార్యాలందు దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు మెరుగవుతాయి. శుభకార్యాలందు శ్రద్ధ కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలందు సంతృప్తి. వ్యవహార దక్షతతో కార్య జయం. మిత్రుల సహకారాలుంటాయి. వీలువెంట పనులు స్వయంగా నిర్వహించుకోవాలి. వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, సాంకేతిక రంగాల వారు లాభాలను పెంచుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రయాణాలు సౌకర్యవంతం. స్ర్తిలు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వస్తు, వస్త్ర లాభాలను అందుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

పనులు పూర్తి చేస్తారు. సమస్యలున్నా పరిష్కార మార్గాలు వెతుక్కుని బయటపడతారు. శ్రమాధిక్యత. విద్య, వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి శ్రమకు మించిన బాధ్యతలు ఉంటాయి. దంపతుల పనులు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మెరుగవుతాయి. వాహన సౌఖ్యం, ప్రయాణ సౌఖ్యం నియంత్రణలో ఉంటే బాగుంటుంది. పోటీ పరీక్షలు, విదేశీ ప్రయాణ ప్రయత్నాలు మెరుగవుతాయి. మిత్ర సహకారం. ఆదాయ పురోగతి ఉంది.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855