S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దటీజ్..ప్రియాంక!!

‘‘ఎదిగే తారలపై గాసిప్స్ సృష్టించడం మామూలు విషయమే. ఏ నటిపైనా గాసిప్స్ బాగా వచ్చాయంటే ఆ నటి కెరీర్‌లో బాగా ఎదిగినట్టే. ఎన్నో కలలతో..మరెన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టిన ముద్దుగుమ్మలపై గాసిప్స్ వారిని ఎంత బాధిస్తాయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి’’అంటోంది సీనియర్ నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషించి అందరిచేత ప్రశంసలందుకున్న నటి ప్రియాంక ఇలా అనడమేమిటని అనుకుంటున్నారా? అవును..నిజమే! ఎవ్వరికైనా ఈ ప్రశే్న వస్తుంది. అయితే ఇటీవల బాలీవుడ్‌లో గాసిప్స్ అనేవి మరీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా అగ్రస్థానంలో వున్న తారలపై ఇవి మరీ శృతిమించిపోతున్నాయని పరిశ్రమ వర్గాలు కోడైకూస్తున్నాయ్. అందుకే నటి ప్రియాంక కూడా ఈ విషయంలో నోరు మెదపాల్సి వచ్చింది. తోటి నటీమణులపై రోజూ వచ్చే గాసిప్స్ చూసి చూసి విసుగెత్తిపోయినట్టుంది. అందుకే ఈ ఇలా ఢంకా బజాయించాల్సి వచ్చిందట. దటీజ్...ప్రియాంక!!

-సమీర్