S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫుల్ జోష్..!

అందాల తార శ్రుతి హాసన్ ఫుల్ జోష్‌లో వుంది. తాజాగా టాలీవుడ్‌లో నాగచైతన్యతో ‘ప్రేమమ్’తో పాటు, పవన్ కల్యాణ్ ‘కాటమ రాయుడు’ చిత్రాల్లో నటిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనకు నచ్చిన పాత్రల్లో జీవిస్తూ, కెరీర్‌లో సరైన బాటనే ఎంచుకుంటోంది. అయితే ఏ ఒక్క భాషకో పరిమితం కాకుండా అన్ని భాషల్లో నటిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. టాలీవుడ్ సరే.. బాలీవుడ్ మాటేమిటి? అని శ్రుతిని కదిలిస్తే- ‘‘నాకు ఏ ఒక్క భాషకో పరిమితం అవడం ఇష్టం లేదు. నటి అన్నాక అన్ని రకాల భాషల్లో నటించాలి. నేను ఇప్పుడు చేస్తున్న పనే అదే. తెలుగు, తమిళ భాషల్లో నేను చేసిన పాత్రలు అందరికీ నచ్చాయి. ఆయా చిత్రాలను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే బాలీవుడ్‌లోనూ నాకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలన్నదే నా ఆశ. కచ్చితంగా చేసి చూపిస్తా’’నంటూ చెప్పుకొచ్చింది శ్రుతి. కమల్ కూతురుగానే కాక, ఓ నటిగా కూడా తనని తాను నిరూపించుకుంది శ్రుతి. బాలీవుడ్‌లో కూడా అన్నంత పనే చేస్తుందనే అనుకుందాం. ఆల్ ది బెస్ట్ శ్రుతి! అనకుండా వుండగలమా?!

-సమీర్