S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

ఎం.కనకదుర్గ, తెనాలి
ఫ్రాన్స్ సంస్థతో జలాంతర్గాముల నిర్మాణంపై సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు ఒప్పందం కుదిరిన తర్వాత రెండేళ్లకే దేశం నుండి 22 వేల పేజీల డాక్యుమెంట్లు విదేశీయుల చేతులలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఈ జలాంతర్గాముల సాంకేతికత, లోటుపాట్లు మొత్తం బయట ప్రపంచానికి తెల్సిపోయిందని ప్రపంచవ్యాప్తంగా కథనాలు వెలువడుతున్నాయి. భద్రత, రక్షణ నిఘా వ్యవస్థలు గాలిలో దీపం చందాన మారిన తరుణంలో కీలక రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు అభిలషణీయమేనా?
రోదసి రంగంలోనే ఇంకో దేశం మీద ఆధారపడకుండా స్వావలంబన సాధించిన వాళ్లం రక్షణ రంగంలోనూ ఆ ఘనత సాధించగలం. ప్రభుత్వం ముందుచూపుతో దీర్ఘకాల ప్రణాళిక వేసి అమలు జరపగలిగితే సాధ్యం కానిది ఏదీ లేదు. రక్షణలో విదేశీయులకు చోటు ఎప్పటికైనా ప్రమాదమే.

కాళిదాసు, కావలి
ఎత్తుకోగానే ‘రేప్’ సీన్, పక్కా ఐటం సాంగ్, హింస, ప్రతీకారం, పగలతో కూడిన ఇటీవల విడుదలైన ఓ సినిమా హీరో దీపావళి, పర్యావరణం, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ లంటూ ఓ మొక్కను చేతుల్లో పట్టుకొని, సూర్యుడికి, సముద్రానికి దణ్ణమెట్టగానే అద్భుతమైన సందేశాత్మక సినిమా అంటూ మోసేయడం ఎంతవరకు సబబు?
అది మోసేవారికి మోయించేవారికి తెలియాలి. కనీసం ఆ మాత్రమైనా సామాజిక హితాన్ని చొప్పించినందుకు సంతోషించాలి.

పుష్యమీసాగర్, హైదరాబాద్
భాగ్యనగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం అంతా అతలాకుతలం అయ్యింది.. కోట్లు కుమ్మరించి వేసిన రోడ్లు ఒక్క భారీ వర్షానికే కొట్టుకుపోతే భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం అయితే దిక్కేంటి..?
దేవుడే దిక్కు.

దేశానికి మూడు పతకాలు తెచ్చారని కోట్లు గుమ్మరించారు. మరి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీర సైనికుల కుటుంబాలకి కేవలం సంతాప సందేశాలు... పొగడ్తలతోనే సరిపెడతారా మన పాలకులు.. ఈ ద్వంద నీతిని ఏమిటి అంటారు?
దౌర్భాగ్యం.

పట్నాల సూర్యనారాయణ, రాజమండ్రి
రియో ఒలింపిక్స్‌లో గెలిచిన మన భారతీయ ఆటగాళ్లకు రాష్ట్రంలోనేకాక కేంద్రంలో నుంచి అనేక బహుమతులు వస్తున్నాయి. మద్యపానం గట్టిగా నిషేధించాలి. అది నేరంగా పరిగణించి కఠినంగా శిక్షించాలి అన్న దూబగుంట రోశమ్మకు బ్రతికి వుండినా మరణించినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వపరంగా ఆమెకు అవార్డులు రాలేదు. ఆమెకు ఆదాయం సమకూర్చలేదు. కారణం ఏమిటి?
రోశమ్మకు పబ్లిసిటీ వాల్యూ లేదు. పలుకుబడీ లేదు. అలాంటి వాళ్లు పాలకుల కంటికి ఆనరు.

మనలో మనం పేజీకి ఎన్ని ప్రశ్నలను పంపినా ఒక్క ప్రశ్నకే సమాధానం దొరుకుతుంది. రెండు మూడు ప్రశ్నలు చెత్తబుట్టకు పోతున్నాయి. ముగ్గురు నలుగురిని పర్మినెంటు చేసుకొన్నారనిపిస్తుంది.
వారిలో మీరొకరని ఎవరో అన్నారు.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పవర్‌స్టార్ లక్ష్యం నెరవేరుతుందా?
నెరవేరవచ్చు. అతడు నిజంగా పట్టుపడితే.. శ్రద్ధ పెడితే.. తనలోని గందరగోళాన్ని తొలగించుకుంటే.

పి.ఎల్.నరసింహారావు, నెల్లూరు
చరిత్ర గర్భంలో దాగిన నిజాలను వెలికితీసి, పాఠకులకు అందిస్తున్న (గాంధీ ఆడిన నాటకం మొ. ద్వారా) సంపాదకుల వారు అభినందనీయులు. చరిత్రకారునిగా, పరిశోధనాగ్రేసరునిగా వారి నేతృత్వంలో ఇలాంటి వ్యాసాలు ఎన్నో రావాలి. చరిత్ర గర్భంలో దాగిన సత్యాలను తెలియజేస్తున్నందుకు ఆంధ్రభూమికి శతధావందనాలు.
ధన్యులం.

సుజాత లక్ష్మి, కావలి
వర్తమాన దివాలా రాజకీయాలకు దర్పణం; అంకెల, మాటల గారడీవాలాల నిజస్వరూపం; మసిపూసి మారేడు కాయ పూసే మంత్రదండం; మీ ఉన్నమాట విశే్లషణం; తెలిసింది సారూ, రాజకీయాల దివాలాకోరుతనం.
సంతోషం.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
మీరు అన్ని పేపర్లూ చదువుతుంటారనుకుంటాను. అవునా?
ఉద్యోగ ధర్మం.

భారతదేశానికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు?
లేరు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ప్రమాదమని తెలిసి అతి వేగంగా వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్లు, మద్యం సేవించి నడపడం, ఓవర్‌లోడ్‌తో నడపడం వంటివి మానడం లేదు. హెల్మెట్లు పెట్టుకోమంటే సవాలక్ష సాకులు చెబుతున్నారు. నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ, చట్టాలు వాటి అమలు సరిగ్గా లేదని ప్రభుత్వాలను విమర్శించడం సబబా?
కాదు. రూల్సును పాటిస్తే మనకే క్షేమం. ఈ వివేకం మనవాళ్లలో తక్కువ.

అయినం రఘురామారావు, ఖమ్మం
అవినీతి అధికారుల వద్ద దాడుల్లో లభ్యమయిన డబ్బును, ప్రజా అవసరాలకు వాడుకుంటే మంచిది కదా!
దానిలో రికార్డుల కెక్కేది ఖజానాకే చేరుతుంది.
*

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com