S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్లామర్ ‘డోస్’!

అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ తను నటిస్తున్న చిత్రాల్లో గ్లామర్‌డోస్‌ని పెంచడం వల్లే అతి తక్కువ కాలంలో ఇంతటి ఆదరణ లభించిందని తోటి కథానాయికలు ఈ ముద్దుగుమ్మపై అక్కసు వెళ్లగక్కుతున్నారట. అవును..మరి! ఇందులో నిజం లేకపోలేదు. చూస్తూ..చూస్తుండగానే అతి తక్కువ కాలంలో తన గ్లామర్‌తో కట్టిపడేసి యువతను తన వైపునకు తిప్పుకుంది. క్షణం తీరిక లేకుండా చిత్రాల మీద చిత్రాలు చేసేస్తోంది. గ్లామర్‌తోనే కాలాన్ని నెట్టుకొస్తుందని ఆమె సన్నిహితులే కాదు, చిత్రసీమ కూడా కోడైకూస్తోంది. ఈ విషయం గురించి రకుల్‌ని ప్రశ్నిస్తే- ‘‘ఏ నటికైనా గ్లామర్ ఒక్కటే కెరీర్‌ని నిలపదు. యువతరాన్ని ఆకట్టుకోవాలంటే అదే ఒక్కటే కావొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించాలంటే కథ, క్యారెక్టర్ ప్రాధాన్యతతో పాటు అంతా కలిసి చూసేలా చిత్రం వుండాలి. అందుకే నేను చేసే క్యారెక్టర్‌లో గ్లామర్ శృతిమించకుండా చూసుకుంటా. ఏదైనా హద్దులు దాటకూడదు’’అంటూ సెలవిచ్చింది. మరో రెండు, మూడు విజయాలు రకుల్‌కు లభిస్తే ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అని అంటున్నారంతా.

-సమీర్