S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక కోలీవుడ్‌కు...!

టాలీవుడ్‌లో కాస్త ఇమేజ్ రాగానే తమ తదుపరి అడుగు కోలీవుడ్.. ఆపై బాలీవుడ్‌వైపునకు వేయాలని చాలా మంది తారలు ఉవ్విళ్లూరుతుంటారు. అందుకోసం ఎన్నో కలలు కూడా కంటుంటారు. తమన్నా, శ్రుతిహాసన్, అనుష్క, సమంత ఇలా అనేక మంది అందాల భామలు తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తుండం మనం చూస్తూనే వున్నాం. అదే కోవలోకి ఇప్పుడు యువతరం కలల సుందరి రాశీఖన్నా కూడా చేరిపోయింది. ఇలా రెండు భాషల మోజు సుందరాంగిలకు తీరని దాహమే అయింది. తెలుగులో అతి తక్కువ కాలంలో తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకున్న రాశీఖన్నా తమిళంలోనూ తన ప్రతాపం చూపించడానికి రెడీ అయింది. సిద్దార్థ్‌తో కలిసి చిందులు వేయబోతోంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ‘సైతాన్ కీ బచ్చా’ అనే పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీక్ జి. ప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘తెలుగులో మంచి చిత్రాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నాకు తమిళంలో చేయాలన్న కోరిక ఈ చిత్రం ద్వారా నెరవేరబోతోంది. తమిళంలోనూ ఓ చక్కటి చిత్రం ద్వారా పరిచయం కావాలన్నదే నా ప్రయత్నం. అది ఇలా నెరవేరింది. తమిళంలో ఇదే నా తొలిచిత్రం. చాలా సంతోషంగా వుంది’’అని తన మనసులోని భావాలను పంచుకుంది రాశీఖన్నా. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. బెస్ట్ఫా లక్ రాశీ అని అనకుండా వుండలేం కదా?!

-సమీర్