S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బ్రహ్మోత్సవం(మాతో-మీరు)

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’ శీర్షికన అందించిన కవర్‌స్టోరీ కథనం భక్తి ప్రధానంగా సాగి మా ఇంటిల్లిపాదినీ అలరించింది. ఆ దేవదేవుని దర్శించి తరించిన పుణ్యఫలం దక్కింది. ఫొటోలు అత్యద్భుతంగా ఉన్నాయి. చిరునవ్వు వెల ఎంత? కథ చాలా బాగుంది. కనుమరుగవుతున్న జీవజాతుల గురించి అందించిన ప్రత్యేక కథనం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం, తూ.గో.జిల్లా)

కోరిక
బలమైన కోరిక ఉంటే ఒక్కోసారి అనుకోనివి సుసాధ్యవౌతాయనిపించింది ‘సండే గీత’ చదివితే. కంపెనీలకు స్టార్ ప్లేయర్లకన్నా టీమ్ ప్లేయర్లే ప్రధానమని ‘ఓ చిన్న మాట’ ప్రస్ఫుటించింది. వేముల ప్రభాకర్ ‘సియాసత్’ నేతల నగ్న స్వరూపాన్ని, స్వభావాన్ని ప్రతిబింపజేసింది. ప్రేమా పిచ్చీ ఒకటే కథ బాగుంది.
-నేమాన సుభాష్‌చంద్రబోస్ (విశాఖపట్నం)

అన్నీ బాగున్నాయి
ఈ వారం ఆదివారం ఆంధ్రభూమిలో అన్ని అంశాలు బాగున్నాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందించిన కవర్‌స్టోరీ చాలా బాగుంది. టూరిజంకు సంబంధించి మంచి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఇటు ఆదాయం, అటు విజ్ఞానం వికాసం అందించేది పర్యాటక రంగం మాత్రమే. ఇక శాస్ర్తీగారి కలం నుండి వెలువడిన చారిత్రక సీరియల్ ‘్భగత్‌సింగ్’ ఆద్యంతం ఆలోచింపజేసింది. ఈ సీరియల్ ఇప్పుడు పుస్తక రూపంలో రావడం హర్షణీయం. శాస్ర్తీగారి కలం నుండి రాబోయే కొత్త రచనల కోసం ఎదురుచూస్తున్నాం.
-మార్టూరు అజయ్‌కుమార్ (రామచంద్రాపురం)

స్ఫూర్తి
విప్లవవీరుడు భగత్‌సింగ్ మీద చేసిన పరిశోధనా వ్యాస పరంపర స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఉరికంబం ఎక్కకుండా ఉంటే విప్లవ కెరటాలు వెనక్కి తగ్గుతాయనే ఆలోచన భగత్‌సింగ్‌కు రావడం అంత కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే ఈ విప్లవవీరుడు స్వాతంత్య్ర సమరం సాగించిన జ్వాలలు ఇంకా ఉవ్వెత్తున ఉప్పొంగి బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి ఇంకా ముందుకానే స్వాతంత్య్రం సిద్ధించి ఉండేదేమో! సుభాష్ చంద్రబోస్ అకాల విషాద మరణం కూడా లోపమే. స్వాతంత్య్ర ఫలం మొత్తం క్రెడిట్ మహాత్మాగాంధికి ఆపాదించినా చరిత్రలో మరుగున పడిన వేలాది కృషీవలురెందరో! శాస్ర్తీగారు చేసిన అవిరళ కృషి అభినందనీయం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)

విశ్వ రహస్యం
విశ్వ రహస్యం గుట్టు విప్పే గ్రావిటీ వేవ్స్ - వ్యాసం మాకు తెలీని ఎన్నో విషయాల గుట్టు విప్పింది. సైన్స్ రచనల ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి వ్యాసాలను నెలకొకటి అయినా ఇస్తారని ఆశిస్తున్నాం. క్రైం కథ ఎత్తుగడ, ముగింపు చాలా బావున్నాయి. దొంగ ఎవరనేది పాఠకుల ఆలోచనకే వదిలేయడం సరికొత్తగా ఉంది. అక్కడున్న ఏడుగురు అతిథులే కాక పార్టీ జరుపుకుంటున్న మేరీ కూడా అనుమానితురాలే. ఎందుకంటే ఆట పట్టించడానికి ఆమె రింగ్ దాచేసి నాటకం ఆడి ఉండొచ్చు కదా. ఆహారపు వేట, తినడం, నిద్ర పోవడం వరకే పరిమితమైన పండా గురించి నమ్మలేనన్ని నిజాలు చెప్పి అలరించారు.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)

కలత
‘్భగత్‌సింగ్’ చరమాంకం మా హృదయాల్ని కలచివేసింది. ఈ సీరియల్ పుస్తక రూపంలో రావడం, భూమి పాఠకులకు తక్కువ ధరలో ఆఫర్ చేయడం ముదావహం. ప్రేమ పిచ్చీ ఒకటే అని చెప్పిన కథ కూడా బరువుగానే ఉంది. చిన్ననాట గుండెలో పాతుకుపోయిన భయం, ప్రసవ సమయంలో హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే సమస్యలు చక్కగా వివరించారు. రామాయణ గాథలో తప్పులను గుర్తించమనే కొత్త శీర్షిక బాగుంది. స్థూలంగా రామాయణం తెలిసిన వారికి కూడా నిజంగానే వివరాలు అంతగా తెలీవు. పట్టించుకోరు కూడా. ఇంట్లో రామాయణ గ్రంథం ఉంటే ఎంత బాగుండు అనిపించింది.
-బి.ప్రభాస్ (గాంధీనగర్)

చక్కటి విశే్లషణ
నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆశావాద దృక్పథంతో ఎలా ఎదుర్కోవాలో సండే గీతలో అత్యద్భుతంగా విశే్లషించారు. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూడకుండా, తమకంటే ఎక్కువ సమస్యలు వున్న వారితో పోల్చుకుంటే దీపం ముందు చీకటిలా సమస్యలన్నీ మటుమాయం అవుతాయన్న సిద్ధాంతాన్ని మరొక్కసారి చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు. పుట్టుకతో కాకుండా కర్మాచరణ ద్వారా చతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడిన వైనాన్ని వాసిలి గారు ‘వినదగు’లో చాలా చక్కగా వివరించారు.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)

***
మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, రచనలు, కార్టూన్లు, ఫొటోలు bhoomisunday@deccanmail.comకు పంపించవచ్చు.