S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్లామర్‌కు సై!

...అనక తప్పడంలేదు అందాలభామ యువతరం కథానాయిక శ్రీదివ్యకు. చిత్రసీమలో కథానాయికగా రాణించాలంటే గ్లామర్ తప్పదన్న విషయాన్ని ప్రతీ కథానాయికకు తెలుసు. గ్లామర్ షోలో ఎంత రెచ్చిపోతే అంతగా కెరీర్‌లో ముందుకు వెళ్లొచ్చు అన్న భావన అందాల భామల్లో బాగానే పేరుకుపోయింది. ఇప్పుడు చిత్రసీమలో గ్లామర్ భామలకే భలే గిరాకీ వున్న సంగతి మనకు తెలియంది కాదు. తాజాగా అలాంటి కథానాయికల జాబితాలో శ్రీదివ్య కూడా చేరిపోడానికి ఆసక్తి చూపుతోందిట. రవిబాబు ‘మనసారా’ చిత్రంతో తెరకు పరిచయమైంది శ్రీదివ్య. ‘బస్టాప్’ సినిమాతో చక్కటి పేరుతెచ్చుకుంది. ఇది ఇలా వుండగా తమిళనాట వరుస విజయాలతో కెరీర్ స్పీడందుకుంది. అతి తక్కువ సమయంలోనే కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. శివకార్తికేయన్ లాంటి కుర్ర హీరోలకు శ్రీదివ్య సూపర్‌జోడీగా మారింది. మారి ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడికి గ్లామర్‌షో ఎందుకనుకుంటున్నారా? అదే మరి..కెరీర్‌లో ఇంకా దూసుకెళ్లాలంటే ఇది తప్పదనుకుంటుందట. అవునా? అని ఆమెనే కదిలిస్తే- ‘‘అందాల ఆరబోతకు నేనెప్పుడూ దూరమే. గ్లామర్‌షోతో కెరీర్ నిలవదు’’ అంటూ తప్పించుకునే మాటలు చెప్పి జారుకుందట! అదీ..సంగతీ!! వాహ్..శ్రీదివ్య!!

-సమీర్