S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇక నిర్మాణరంగంలోకి...!

టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా విశేష ప్రాచుర్యం పొందిన మిల్క్‌బ్యూటీ తమన్నా ఇకపై నిర్మాణరంగంపై దృష్టి సారించి నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోందిట. విభిన్న పాత్రల ద్వారా అగ్ర హీరోల సరసన చిందులేసి రెండు భాషల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న ఈ సుందరాంగి ఓ పక్క తనకిష్టమైన జువెలరీ బిజినెస్‌ను కొనసాగిస్తూనే ఇలా నిర్మాణం రంగంలోకి దూకుతోంది. త్వరలో ఓ తమిళ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథా చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయట. త్వరలోనే తను తీయబోయే చిత్రం గురించి, ప్రొడక్షన్ హౌస్ విషయాన్ని అధికారికంగా వెల్లడించనుందట. తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో నటించిన త్రిభాషా చిత్రం ‘అభినేత్రి’లో ఆమె హావభావాలు అందర్నీ అలరిస్తున్నాయి. అలాగే తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించిన ‘జాగ్వార్’ కూడా దసరాకే వచ్చింది. ‘కత్తి సందై’, ‘ఏ.ఏ.ఏ’, ‘బాహుబలి 2’ వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ఇలా రెండు పడవల ప్రయాణం గురించి తమన్నాను కదిలిస్తే- ‘‘ఈ విషయంలో నేను మాత్రం హ్యాపీగానే వున్నా. నటన ఒకవైపు.. నిర్మాణం మరో వైపు ఈ రెండింటిలోనూ నా ప్రత్యేకత నాదే. ఆల్‌రెడీ జువెలరీ వ్యాపారంలో ముందంజలోనే వున్నా’’అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..తమన్నా!!

-సమీర్