S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అన్నీ బాగున్నాయి

ఈ వారం ఆదివారం అనుబంధంలో అన్నీ అంశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘సండే గీత’లో కాలం విలువ గురించి చక్కగా వివరించారు. ప్రపంచంలో ఎవరికైనా ఉండేది 24 గంటలే. సక్రమంగా ఉపయోగించుకుంటే కాలం మనల్ని ఆకాశంలో నిలబెడుతుంది. దుర్వినియోగం చేస్తే అధఃపాతాళానికి తొక్కివేస్తుంది. ‘ఆకాశవాణిలో మన కవుల బాణి’ వ్యాసంలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ, దాశరథి వారు రాసిన గీతాల గురించి చక్కగా వివరించారు. ఈ వారం కవర్ స్టోరీ ‘ఆకలి రాజ్యంలో అలుపెరుగని పోరాటం’ చాలా బాగుంది. వ్యాసంలో చెప్పినట్లు వృధాగా పోతున్న ఆహారాన్ని అరికట్టడానికి అందరూ కృషి చేయాలి. అప్పుడే ఈ సమస్యను కొంతవరకు నివారించగలుగుతాం. సిసింద్రి పేజీ బాగుంటోంది. కథ, మల్లాది క్రైం కథ, కవితలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వ్యాసాలు, వినదగు శీర్షికలు అన్నీ బాగున్నాయి.
-మార్టూరు అజయ్‌కుమార్ (చిలకలూరిపేట)

ప్రత్యేక కథనం
‘ఆకలి రాజ్యంలో అలుపెరుగని పోరాటం’ వ్యాసం ఆలోచింపజేసేదిగా ఉంది. అలాగే ఆకాశంలో మన కవుల బాణిలో దేవులపల్లి, దాశరథిగారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ‘అమృతవర్షిణి’ నిజంగా అమృతధారలానే ఉంది. ఆదివారం అనుబంధం ప్రత్యేకతను చాటుతూనే ఉంది.
-నీలిమ సబ్బిశెట్టి (రాజానగరం)

దేవదేవుడు
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రచురించిన వ్యాసం ‘తిరు వీధుల మెరసీ దేవదేవుడు’ తిరువీధుల్లో సంచారంలా అద్భుతానందం కలిగించింది. ‘ఇప్పుడు నీ భార్య ఎవరు?’ అన్న శీర్షిక చదవగానే అత్యంత ఆసక్తి కలిగింది. అధిక వివాహాలు చేసుకోవడానికి అధిక విడాకులిచ్చుకున్న ఘనుల గురించి నమ్మలేనంతగా చెప్పిన నిజాలు ఆహా అనిపించాయి. ఊహించని విధంగా ముగిసిన ‘చెడ్డవాడు’ కథ ఉత్కంఠభరితంగా ఉంది. ఎలా ప్రవర్తించాలో చాలా ఉపయుక్త సూచనలిచ్చిన శర్మగార్కి కృతజ్ఞతలు.
-ఎస్.కృష్ణ (కొండయ్యపాలెం)

వర్తమానం
గతం గురించిన ఆందోళన, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ దిగులు చెందడం సరికాదు. వర్తమానం గురించి ఆలోచించి వర్తమానంలో జీవించాలన్న ఓ చిన్న మాట స్ఫూర్తిదాయకంగా ఉంది. తెలిసీ తప్పు చేయడంలో ఒక ఆనందం ఉందంటూ గురువుల గురించి, చరిత్ర పఠనావశ్యకత గురించి గోపాలంగారు బహు చక్కగా వివరించారు. అక్షరాలోచనాల్లో ‘స్వేచ్ఛ కోసం’ కవిత బాగుంది. ముఖ్యంగా ‘దిక్కుతోచక తెలియని దారిలో నీకు నువ్వు అపరిచిత వ్యక్తివే’ అన్న అభివ్యక్తి అద్భుతం.
-ఎన్.గిరిధర్ (కాకినాడ)

విశ్వగీతమే
ప్రేమగా మాట్లాడితే ఎవరైనా ప్రభావితం అవుతారు. మనతో మనం కూడా ప్రేమగా మాట్లాడుకోవాలి. ప్రేమ నిండిన మాటలు విశ్వమంతా పరివ్యాప్తం కావాలన్న సండే గీత నిజంగా విశ్వగీతమే. రోబో పిజ్జా కబుర్లు ఆకట్టుకున్నాయి. పారిశ్రామికీకరణం, వంతెనలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల వన్యప్రాణుల మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి చక్కగా వివరించారు.
-బి.చంద్రిక (రాజేంద్రనగర్)

జీవిత సత్యం
రోడ్డు ప్రయాణంలో ఎత్తుపల్లాలు, గతుకులు, మలుపులు, ఉత్కంఠలు, విషాదాలూ ఉంటాయి. జీవితమూ అంతే అన్న సండే గీత ఒక జీవిత సత్యాన్ని ఆవిష్కరించింది. పరమ కంగాళీ చిత్రం భశుం అనే కార్డుతో ముగిసినట్టు బాపు కార్టూన్ ఉంది. జీవితం భశుం కాకుండా మనమే చూసుకోవాలి. ‘అవీ ఇవీ’లో చెప్పిన నెవడా ఎడారిలో కనువిందు కళాకృతులు, బొమ్మలు కలిసిపోయేట్టు శరీరానికి రంగులు పూసుకున్న అమ్మడు కథనం అలరించాయి. మహిళా రిజర్వేషన్ల వల్ల రాజకీయాల్లో పెద్దగా ఉపయోగం లేదు. పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో గెలిచిన చాలామంది మహిళల భర్తలే అధికారం చెలాయిస్తున్నారు.
-జె.జ్ఞానబుద్ధ (సిద్ధార్థనగర్)

అమృతవర్షిణి
కొత్త శీర్షిక ‘అమృతవర్షిణి’ మమ్మల్ని సంగీత ప్రపంచంలో విహరించేట్టు చేసింది. త్యాగరాజు సంగీత మహోత్సవాల విశిష్టతను, ఆ వేడుక కొరకు ఎదురుచూసే సంగీతాభిమానులు, సంగీత కళాకారుల ఆతృతని స్పష్టం చేశారు. అలాగే ‘సండే గీత’ ఆలోచింపజేసేదిగా ఉంది. మనిషి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ అగాధం లాంటి భవిష్యత్‌ను ఊహించుకుంటూ కుంగిపోకుండా ‘జీవితం’ అనే ఆశల పల్లకిలో పయనించాలి. అప్పుడే నిజమైన జీవితానికి అర్థం పరమార్తం లభించినట్లు.
-ఉప్పు సత్యనారాయణ (తెనాలి)