S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మనలో మనం (ఎడిటర్‌తో ముఖాముఖి)

పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి
భగత్‌సింగ్ విషయంలో మహాత్ముని ఆలోచన, పాత్ర భారతంలో శ్రీకృష్ణునితో పోల్చవచ్చంటారా?
శకునితో పోల్చవచ్చు.

ఇంతకీ పవన్‌కళ్యాణ్ రాజకీయ నాయకుడా లేక సామాజిక కుల వర్గ నాయకుడా?
రెండూ కాదు.

ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
భగత్‌సింగ్ పుస్తకం భూమి పాఠకులకు 150 రూపాయలు అన్నారు. పాఠకులనెలా గుర్తిస్తారు? పాఠకులమని చెప్పి 150కే కొంటారేమో?!
కొన్నవాడు పాఠకుడు.

సీరపు మల్లేశ్వరరావు, కాశీబుగ్గ
రాష్ట్రాల్లో చిన్న సమస్యలకు పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న కొన్ని రాజకీయ పార్టీల, పార్లమెంటు సభ్యులు చైనా - పాక్‌లు భారత భూభాగాల ఆక్రమణలు భారత్‌ను కృంగదీస్తాయన్న దాని గూర్చి పట్టించుకోరేం?
లాభం లేని వ్యాపారి వరదన పోడు.

ఉప్పు సత్యనారాయణ, తెనాలి
ఆ మధ్య గుంటూరు జిల్లా ‘బొగ్గరం’ గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో పంచలోహ విగ్రహాలు, వెండి కిరీటాలు, నగలు దోపిడీ దొంగలు దోచుకెళ్లటం, మరోవైపు పెసర్లంక గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో ద్వంద్వార్థాలతో రికార్డు డాన్సులు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడటం లాంటి సంఘటనలు ప్రజల్లో భక్తి విశ్వాసాలకు, దైవత్వానికి కళంకం తేవటం కాదా?
మనుషులు చేసే వెధవ పనుల వల్ల దైవత్వానికి కళంకం అంటదు.

కె.హెచ్.శివాజీరావు, చైతన్యపురి, హైదరాబాద్
క్రీడాకారులు పతకాలు సాధించినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలు, కోట్లు బహుమతులు ప్రకటిస్తాయి. తన్యా అనే విద్యార్థిని హైదరాబాద్ నల్సార్ న్యాయ విద్యాలయంలో ‘లా’ చదివి వివిధ శాఖలలో 7 బంగారు పతకాలు గెల్చుకుంది. ఏ రాజకీయ నాయకుడు గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుమతులు ఇవ్వకపోగా కనీసం అభినందనలు కూడా తెల్పలేదు. చదువులో ప్రతిభ కనపరచిన వారిని ఎందుకు చిన్నచూపు చూస్తారు?
ప్రభుత్వాల నాయకుల నెందుకు తప్పు పట్టటం? మీరన్నటువంటి ఘనతలకు మీడియా మాత్రం ప్రాముఖ్యం ఇస్తున్నదా? పౌర సమాజం పట్టించుకుంటున్నదా? యథా ప్రజా తథా రాజా.

గుండు రమణయ్య, పెద్దాపూర్, కరీంనగర్
నరుూం కేసు ఇప్పట్లో తేలేనా?
ఎప్పటికీ తేలదు.

భుజంగనాథ్, వక్కలంక
అమరావతిలో రాజధాని నిర్మాణం విషయంలో పర్యావరణ అనుమతుల ఫిర్యాదుల కేసు పర్యవసానం ఎలా ఉండబోతున్నది? అనుమతుల నిరాకరణ జరిగితే కట్టిన భవనాల సంగతి?
అనుమతి లేకుండా కట్టడాలూ, అక్రమ కట్టడాలకు అనుమతులూ మనకు మామూలే.

పి.రామకృష్ణ, రాజమండ్రి
సరళీకరణ పేరుతో మన్మోహన్‌సింగ్ గారు వ్యాపారాన్ని లైసెన్సులు లేకుండా చేస్తే వారు సిండికేటు అయి మద్యం, సిమెంటు, అల్లం, బెల్లం, ఇసుక రేట్లు శాసించి సామాన్యుణ్ణి పీల్చి పిప్పి చేస్తున్నారు. రేపు జిఎస్‌టి బిల్లు వల్ల మరింత దోపిడీ పెరగదా?
ఇప్పుడే చెప్పలేం. చూడాలి.

కాకుటూరి సుబ్రహ్మణ్యం, మదరాసు
మేము చాలా ధర్మసందేహాలు పంపాము. ఒక్కటి కూడా కనపడలేదు. బహుశా దీనికి కూడా ‘్భవిష్య’ లాగా కూపన్ పెడితే బాగుంటుందేమో?
తపాలా శాఖ వారి సేవల అస్తవ్యస్తత వల్ల కూడా ఉత్తరాలు ఒక్కోమారు సరిగా అందడం లేదు.

సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఇటీవల ముగిసిన వినాయక చవితి పందిళ్ల వద్ద పొద్దస్తమానం బూతు పాటలే! ఒకరి కంటే మరొక మండలి బాగా చెయ్యాలన్న పోటీయే తప్ప ఆధ్యాత్మిక భావం అందరిలో లోపించింది. ఇక నిమజ్జనం ఉత్సవాలలో సభ్యులు చిత్తుగా తాగేసి, పెద్ద సౌండ్‌తో బూతు పాటలు పెట్టి అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. కొందరు అర్ధరాత్రిళ్లు డాన్సులు, పాటలు, లౌడ్ స్పీకర్లతో నిద్రపోనివ్వకుండా చేశారు. భక్తి లేకుండా ఇతరులకు అంతరాయం కల్గించే విధంగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం సబబా?
కాదు. కాని ఇతరులకు అంతరాయం, చికాకు కలుగుతున్నది కేవలం హిందూ వేడుకల్లో అతి కారణంగానేనా? ఇతర మతస్థుల వల్ల కలిగే చికాకుకు కూడా ఇంత తీవ్రంగా స్పందించ గలుగుతున్నామా?

ఎం.కనకదుర్గ, తెనాలి
వివిధ రాష్ట్రాల మధ్య వివాదాలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో సామాన్యమైన విషయం. చర్చలు, న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోకుండా విధ్వంసాలకు పాల్పడటం దారుణం కాదా! ఇటీవల కావేరీ జల వివాదం మూలంగా బెంగళూరులో తమిళనాడుకు చెందిన యాభై బస్సులు తగులబెట్టడం, తమిళుల ఆస్తుల్ని ధ్వంసం చేయడం మూర్ఖత్వానికి, అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట కాదా?
ముమ్మాటికీ.
*
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా : మనలో మనం, ఆదివారం అనుబంధం, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవీ రోడ్, సికిందరాబాద్-500003. e.mail : bhoomisunday@deccanmail.com