S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దిగులు పొరల్లోంచి...

గాఢమైన దిగులు పొరల్లోంచి
ఉత్సాహవంతమైన కిరణమొకటి
అలా నడచి వస్తుంది
మెల్లగా మనసుని తడుముతుంది
అసందర్భంగా జారిపోయిన
క్షణాలను వెనకకు తెస్తుంది
అరచేతుల్లో ఆనందాన్ని
మోసుకొస్తుంది

వికసించే విరి ఆవిరి తెమ్మెరలో
ఉక్కిరిబిక్కిరి కానిదే
పుష్పం పరిమళం వెదజల్లదు

నిశ్శబ్దాన్ని ఛేదించే అనుభూతి ధార
ఉద్వేగాల వాగులో ప్రయాణించనిదే
అక్షరానికి ఆయువు అందదు

కాలానికి అతీతంగా
కోసుకుపోయిన గాయాలను
వేగవంతమైన చిర్నవ్వు అతికిస్తుంది
మూసుకుపోయిన అనుబంధాల దారులను
ఆర్ద్రంగా అతికిస్తుంది

బెంగటిల్లిన సమయాలే
అనుభవాలకు వారధులు
ముసురు పట్టిన మేఘాలే
మనసు నిండా కురిసే
ప్రశాంతతకు చిహ్నాలు

లయాత్మక వేదికపై
అన్నీ తాత్కాలిక అలజడుల అమరికలే...
చనిపోయిన క్షణాలను బతికించే
సంజీవనీ మాలికలే...
*

-మొదలి పద్మ 9248259622