S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రేమ

భర్తలను భార్యలు ప్రేమించినంతగా భర్తలు భార్యల్ని ప్రేమించడం లేదన్నది ‘ఓ చిన్న మాట’లో తేటతెల్లం చేశారు. భర్తల గుండెల్లో ఆ చిన్న మాట గట్టి దెబ్బే! ‘మనలో మనం’లో మీ సమాధానాలు ముఖ్యంగా ‘మేము చింతించడం లేదు’ ‘ఏలిన వారికి కావలసింది పబ్లిసిటీ’ ‘పెళ్లికాని వారంతా బ్రహ్మచారులు కారు’ లాంటివి అలరించాయి. ‘ఆకాశవాణి’లో మన కవుల బాణీ ఆహ్లాదకరంగా ఉంది. ఆ పాటలన్నీ ఓసారి మనసులో మెదిలాయి. కాని ఆకాశవాణిని వినేవారే కరవయ్యారు. ఆ పాటలు అడపాదడపా టీవీల్లో రావడమే గొప్ప!
-కె.హితీక్ష (రమణయ్యపేట)
క్షుదానందం
సదానందం, చిదానందంగా సాగిన బతుకులు క్షుదానందంలో కూరుకుపోయాయంటూ గోపాలంగారు చెప్పిన వ్యవసాయ విషయాలు ఆకట్టుకున్నాయి. కవర్‌స్టోరీ ‘ఆకలి రాజ్యంలో అలుపెరుగని పోరాటం’ విశేషాలు ఆలోచింపజేశాయి. భార్య మరణానికి నివాళిగా విన్‌స్టన్ ఓక్ మొక్కల్ని హృదయాకారంలో నాటి వాటిని పెంచడం సరికొత్తగా బావుంది. తన తప్పేం లేకపోయినా ఉద్యోగంలోంచి తీసేశాడన్న అనుమానంతో కక్ష తీర్చుకోవడం పాత కానె్సప్టే. కానీ మీసం ఫోబియాని ప్రచారం చేసి పిచ్చివాడని అందర్నీ నమ్మించి కక్ష తీర్చుకోవడం కొత్తగా ఉంది. అందుకే మీరు ప్రచురించే క్రైం కథలు సూపర్బ్.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
సమయం
సమయమే ధనం అంటారు చాలామంది. కాని సమయం, ధనం రెండూ వేర్వేరు. కోల్పోయిన సమయాన్ని పొందలేం. కోల్పోయిన ధనాన్ని పొందవచ్చు అని చెప్పిన ‘సండే గీత’ మాకు నచ్చింది. ‘అవీ ఇవీ’లో చెప్పిన గుడ్ ఆర్ట్, గిన్నీస్ రికార్డు సాధించిన పెళ్లి దుస్తులు బావున్నాయి. ఆకాశవాణి పతాక శీర్షికలు కార్యక్రమంలో ఆంధ్రభూమిని ప్రస్తావించనందుకు మాకు చింతగా ఉంది. కొన్ని గ్రామాల్లో భూమి వీక్లీ దొరుకుతున్నా దినపత్రిక మాత్రం రావడం లేదు. ప్రతీ గ్రామంలో భూమి దినపత్రిక లభించేట్టు చూస్తారని ఆశిస్తున్నాం.
-ఎ.శాంతిసమీర (వాకలపూడి)
అంతఃకరణ శుద్ధి
ఈ వారం ‘వినదగు’లో దివ్యత్వమైనా, దానవత్వమైనా పుట్టుక మనస్సు నుండేనని, అంతఃకరణ శుద్ధితోపాటు ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ, మనస్సును భగవంతుని వైపు నడిపించేలా సాధన చేయడమే మానవులలో దైవత్వాన్ని పాదుకొల్పడమని వాసిలి గారు చక్కగా వివరించారు. మంజరి ‘ఒక్క తూటా చాలు’ సీరియల్ ప్రారంభంతోనే ఆకట్టుకొంది. ఉద్యోగులలో ఉత్పాదకత, నియమ నిబద్ధతతను పెంచేందుకు యాజమాన్యం అనుసరించాల్సిన వైఖరిపై సి.వి.ఎస్ గారి సూచనలు అమూల్యం. తమిళనాట జరిగే మార్గశిర సంగీతోత్సవాలను గురించి ‘అమృతవర్షిణి’లో చక్కగా వివరించారు. పుట్టుకతో త్యాగయ్య తెలుగువాడైనా, తెలుగునాట ఆయన స్మృత్యర్థం నిర్వహించే కార్యక్రమాలు బహు స్వల్పం కావడం దురదృష్టకరం.
-సి.ప్రతాప్ (శ్రీకాకుళం)
కవుల బాణీ
కొత్త శీర్షికలతో, సరికొత్త అందాలతో ఆదివారం అనుబంధం చదువరులను ఆకట్టుకొంటోంది. ‘ఆకాశవాణిలో మన కవుల బాణీ’ ‘అమృతవర్షిణి’ ఇందుకో మధురమైన ఉదాహరణ. సండే గీత, ఓ చిన్న మాట, లోకాభిరామమ్, వినదగు మొదలైనవన్నీ చదవకుండా ఉండని పాఠకులుండరేమో. తమ హృదయ వాణిని తమ బాణీలలో హృద్యంగా ఆకాశవాణి, అలనాటి అపురూప సినిమాలలో అలపింపజేసిన దేవులపల్లి, దాశరథిల జన్మ సార్థకమయ్యింది. వీరు లేకపోయినా, ఈ కవుల అభిమానుల ద్వారా తమ ప్రాణాల్ని పొడిగించుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. గీతాలు ఊహాజనితాలు అన్నాడో ప్రముఖ రచయిత ప్లాటో. కొట్టి పారేశాడీ మాటను అతని శిష్యుడు అరిస్టాటిల్. కృష్ణశాస్ర్తీని పి.బి.షెల్లీతో పోల్చారు. ఇటువంటి వ్యాసాలను మరిన్ని అందించగలరని ఆశిస్తున్నాం.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
ఆకలి కేకలు
ప్రపంచ జనాభాలో అధిక శాతం తిండిలేక ఆకలితో జీవచ్ఛవాలుగా బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అగ్రదేశాలైన అమెరికా వంటి ప్రాంతాల్లోనూ ఈ దుస్థితి ఉంది. అందుకే ప్రపంచంలో వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా 1945 అక్టోబర్ 16న ఐక్యరాజ్యసమితిలో ఎఫ్‌ఎఓ ఆవిర్భవించిందని, పేదలకు ఆహార లభ్యత లేకపోవడంతో విపరిణామాలు మొదలయ్యాయని డా.పాల్ రొమేని 1979లో ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యాన్ని గుర్తించడం, అప్పటి నుండి అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలుసుకున్నాం.
-సరికొండ శ్రీనివాసరాజు (వనస్థలిపురం)