S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘రాష్ట్భ్రావృద్ధిని ఎవరూ ఆపలేరు’

కొత్తవలస, నవంబర్ 21: రాష్ట్భ్రావృద్ధిని ఏ దుష్టశక్తి ఆపలేదని, ఆపేవారు భారీ మూల్యం చెల్లించాల్సిందేనని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం ఎల్.కోట మండలంలోని గొల్జాం, సీతారాంపురం, సంతపేట, పితన్నపేట తదితర గ్రామాలలో జన చైతన్య యాత్రలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూడలేక ప్రతిపక్షం ఓర్వలేకపోతుందని విమర్శించారు. రెండేళ్లల్లో అన్ని రంగాలలో అభివృద్ధిందని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రెండు వాయిదాలు ఇప్పటికే చెల్లించడం జరిగిందని, రైతు రుణమాఫీ రెండు వాయిదాలు అందజేసామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని పూజలు చేస్తూ కూర్చుంటే పనులు జరగవని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నిధులు సాధించి అభివృద్ధి సాధించడం ఇతరులకు రుచించడంలేదని ఎద్దేవా చేసారు. గ్రామాలలో సిసి రోడ్లు, ఇళ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పథకాలు అమలు చేసి రైతులను ఆదుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రమణమూర్తి, జడ్పీటిసి తదితరులు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు చురుగ్గా చేపట్టాలి
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 21: విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా చేపట్టాలని డిటిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ కోరారు. మున్సిపల్ చైర్మన్ ఛాంబర్‌లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంతోపాటు మండలంలో కూడా సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా ఈనెల 30వతేదీన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఉన్నందున విజయవంతం చేయాలని కోరారు. ఆరోజు జరిగే జనచైతన్యయాత్రలో పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యే మీసాల గీత మాట్లాడుతూ నియోజకవర్గంలో జనచైతన్యయాత్రలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కూడా చురుకుగా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సైలాడ త్రినాధరావు, టిడిపి జిల్లా నాయకులు ఐవిపిరాజు, ఎస్‌ఎన్‌ఎంరాజు, మండల పార్టీ అధ్యక్షుడు బి.నరసింరావు, ప్రధాన కార్యదర్శి రవిరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు ముద్దాడ చంద్రశేఖర్, రొంగలి రామారావు, మైలపిల్లి పైడిరాజు, కెల్ల వరలక్ష్మి, గేదెల ఆదినారాయణ, సుంకరి విజయలక్ష్మి, చెన్నా రూపవాణి తదితరులు పాల్గొన్నారు.