S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పెద్దనోట్లు రద్దు చేయడం దారుణం

విజయనగరం (్ఫర్టు), నవంబర్ 21: ప్రజలకు ప్రత్యామ్నాయం చూపకుండా కేంద్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం అన్యాయమని సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావుఅన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కేంద్రంలో బిజెపి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శమని అన్నారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు, 2000 రూపాయల నోట్‌ను వినియోగంలోకి తీసుకురావడం, బడా పారిశ్రామికవేత్తల రుణాలు రద్దు చేయాలని తదితర డిమాండ్లపై సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామేశ్వరరావుమాట్లాడుతూ ప్రజలకు ప్రత్యామ్నాయం చూపకుండా పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్దనోట్ల రద్దు వల్ల నల్లధనం బయటపడుతుందని చెబుతున్న ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకులకు టోకరా పెట్టిన విజయమాల్యా వంటి పెద్ద పరిశ్రమాధిపతులకు వేలాది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను రద్దు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే 100, 500 నోట్లను విరివిగా బ్యాంకులకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సామాన్యులు, పేదలు, రైతులు బ్యాంకులలో దాచుకున్న సొమ్మును వారి వివాహాది శుభ కార్యక్రమాలు, ఇతర అవసరాలకు ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా రెండువేల రూపాయల నోటును రద్దు చేసి, విదేశాలలో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తెచ్చి ప్రతిపేదవాడి ఖాతాలో డిపాజిట్ చేస్తానని ప్రధాని ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అలాగే ఆర్ధిక అసమానతలు తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, జిల్లా కార్యవర్గసభ్యుడు బుగత సూరిబాబు, బి.రమణమ్మ, జగన్నాధం, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.