S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పదివేల మందికి దివ్య దర్శనం

గజపతినగరం, నవంబర్ 21: జిల్లాలో పది వేల మంది నిరుపేదలకు ఉచితంగా దివ్య దర్శనం కల్పిస్తామని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్. ఎస్.వి. ఎస్. ఎస్. ప్రసాద్ అన్నారు. సోమవారం గజపతినగరంలోని సీతారామస్వామి గ్రూపు దేవాలయాల ప్రాంగణాన్ని ఎసి ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి కులాలో ఆర్థికంగా వెనుకబడిన వారికి దివ్య దర్శనం ద్వారా తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం పుణ్య క్షేత్రాలకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఐదు రోజులు పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మండలానికి నాలుగు బస్సులు వంతున కేటాయించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తారని అన్నారు. అర్చకులకు కనీస వేతనం పదివేల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 18వేల ఎకరాలు దేవాదాయ పరిధిలో ఉండగా 3,600 ఎకరాలు కురుపాం, కొమరాడ, పాచిపెంట, సాలూరు, పార్వతీపురం కొండప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు. దీనిలో 6,600 ఎకరాలు మాన్సాస్ సంస్థ ఆధీనంలో నడుస్తున్నాయని చెప్పారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి దేవాలయ భూములు వేలం ద్వారా రైతులకు అప్పగిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల సంక్షేమానికి 60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. చీపురుపల్లి, విజయనగరం పట్టణం తదితర ప్రాంతాలలో పది ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. అనంతరం ఆలయాల పరిసరాలను పరిశీలించడంతోపాటు ఉమారామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై ఎసి ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేసారు. కార్యక్రమంలో గ్రూపు దేవాలయాల మేనేజర్ శ్రీరామ్మూర్తి, టిటిడికి చెందిన వేద పండితులు వేదుల భువనేశ్వర్ ప్రసాద్ శర్మ, ఆర్య వైశ్య సంఘం నాయకులు ఆరిశెట్టి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.