S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘సంక్షేమం’ ఆగేది లేదు

మెరకముడిదాం, నవంబర్ 21: రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తున్నామని రాష్ట్ర గ్రామీణ అభివృద్ది, గృహ నిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిణి అన్నారు. సోమవారం మండలంలో గల ఎం గదబవలస, గోపనన్నవలస, ఎం రావివలస తదితర గ్రామాల్లో మండల అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు ఆద్వర్యంలో జనచైతన్య యాత్రలు జరిగాయి. ఈ సందర్భంగా ఎం గదబవలసలో ఏర్పాటు చేసిన భహిరంగ సభలో మంత్రి మృణాళిణి మాట్లాడుతూ రాష్ట్రం విభజన సమయంలో సమన్యాయం చేస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంద్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆమె అన్నారు. ప్రస్తుతం 16 వేల కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తన తెలివితేటలతో రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి దశల వారీగా అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు మొదటి విడత ఋణ మాఫికి గాను 3800 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ వారంలో రెండవ విడత ఋణమాఫీ కింద 2500 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. అలగే రైతులకు మొదటి విడత ఋణమాఫీ కింద 145.24 కోట్లు విడుదల చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే అన్నారు. అలాగే గదబవలస విషయానికి వస్తే 2014లో అప్పటి ప్రభుత్వం 1.988 లక్షలు రూపాయలు పించన్లుకు పంపిణి చేసేవారని అదే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి 5 రెట్లు పెంచి ప్రస్తుతం 7.31 లక్షల రూపాయలు పంపిణి చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో కేవలం 3 నియోజక వర్గాల్లో కొన్ని మండలాలను మాత్రమే ఎపిఆర్‌డిసి మండలాలుగా ఎంపిక చేయగా అందులో మెరముడిదాం మండలం ఉందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలలు వినియోగించుకుని తమ యొక్క జీవన ప్రమాణాలను మెరగుపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న తెలుగుదేశం నేత కిమిడి నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల నిర్మాణం పై దృష్టి పెట్టి రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. గోపన్నవలస గ్రామ సభలో పాల్గొన్న తెలుగుదేశం నేత కె త్రిమూర్తుల రాజు మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు కాంగ్రెస్ అయామాలో ఎన్నో కష్టాలు అనుభవించారని ఈ గ్రామం మొత్తం తెలుగుదేశానికి కంచుకోట కావడంతో వీరికి న్యాయం చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు భలగం కృష్ణమూర్తి జెడ్‌పిటిసి పెందుర్తి సింహాచళం, రెడ్డి గోవింద చీపురుపల్లి జెడ్‌పిటిసి వరహాల నాయుడు, ఎఎంసి అధ్యక్షులు సీతారామలరాజు పలువురు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.