S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేర్చుకుందాం

శా నిన్నున్ నమ్మిన రీతి నమ్మనొరులన్ నీకన్న నాకెన్నలే
రన్నల్ దమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్సహాయుండు నా
యన్నా యెన్నడు నన్ను సంస్కృతి విషాదాంబోధి దాటించి య
చ్ఛిన్నానంద సుఖాబ్ధి తేల్చెదొకదే శ్రీకాళహస్తీశ్వరా!

భావము:శ్రీకాళహస్తీశ్వరా! నా స్వామీ! నేను నిన్ను ఎంతగా నమ్ముతానో ఇతరులను అంతగా నమ్మను. ఆలోచించి చూడగా నిన్ను మించిన అన్నలు, తమ్ములు, తల్లిదండ్రులు, గురువు, కష్టములెదురైనప్పుడు ఆదుకొనువాడు ఎవరును నాకు లేరు. ఈ సంసారమనే దుఃఖసముద్రాన్ని దాటించి నన్ను అపార ఆనందరాశిలో ఎపుడు ఓలలాడిస్తారో కదా! ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణే సర్వాత్మనా నమ్ముకున్నాడు. నాకు ఎవ్వరూ లేరు. అందరూ నీవే అనడం శరణు వేడిన ప్రపన్నుని లక్షణం. అన్యథా శరణం నాస్తి అని భగవంతుని నమ్మినవారికి ఇహపరసుఖాలు అనాయాసంగా వస్తాయ. శివా అని పిలిచినవారికి అపార ధనసంపదలు ఒనకూడుతాయ. విద్వద్వైభవము కలుగుతుంది.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకపద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకపద్యమిది - కె. లక్ష్మీఅన్నపూర్ణ