S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆర్టీసీలో స్వైపింగ్ మిషన్లు

విజయవాడ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దుతో ఈ వారం పది రోజుల్లోనే రూ.17కోట్ల నష్టం వచ్చిన నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం, చిల్లర సమస్యను అధిగమించేందుకు దశల వారీగా అన్ని బస్ స్టేషన్‌లలో స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టనున్నామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చెప్పారు. స్థానిక పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో గురువారం ఆయన లాంఛనంగా ఈ స్వైపింగ్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రాఘవరావు మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మిషన్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ మెషిన్‌లలో క్రెడిట్, డెబిట్ రూపే కార్డులను స్వైప్ చేసి నగదుకు ప్రత్యామ్నాయంగా కావాల్సిన సేవలను పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఆర్టీసీలో టిక్కెట్, అలాగే అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ల కొనుగోలుకు చిల్లరతో నిమిత్తం లేకుండా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. తొలిదశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 స్వైపింగ్ మిషన్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు.