S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సిమెంట్ బస్తా రూ.230

హైదరాబాద్, నవంబర్ 24: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ బస్తా 230 రూపాలయలకు ఇచ్చే విధంగా హౌజింగ్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. 32 సిమెంట్ కంపెనీలు, హౌసింగ్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం జరిగింది. మూడు సంవత్సరాల వరకు బస్తా సిమెంట్‌ను 230కి అమ్మేందుకు కంపెనీలు సమ్మతించాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం చేపట్టిందని, దీనిని సామాజిక బాధ్యతగా భావించి సహకారాన్ని అందించేందుకు సిమెంట్ కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సిమెంట్ కంపెనీలకు వారం రోజుల్లోనే చెల్లింపులు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. సిమెంట్ సరఫరా, చెల్లింపులో ఏమైనా సమస్యలు ఉన్నా, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తామని మంత్రి తెలిపారు. సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదరడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా చోరవ తీసుకోవాలని మంత్రి కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధుల సమస్య లేదని, రుణం ఇచ్చేందుకు హడ్కో ఇప్పటికే ముందుకు వచ్చిందని చెప్పారు. సబ్సిడీకి ఇచ్చే సిమెంట్ పక్కదారి పట్టకుండా సిమెంట్ బస్తాలపై ప్రత్యేక చిహ్నం ముద్రిస్తామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. గతంలో మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, సిమెంట్ కంపెనీలతో సమావేశమై చర్చించారు. అప్పుడు కుదిరిన సూత్రపాయ అంగీకారం మేరకు ఈరోజు సిమెంట్ కంపెనీలు ప్రతినిధులతో అవగాహనా ఒప్పందం కుదిరింది.